క్రీడాభూమి

ప్రతీకారం దిశగా హర్మత్‌ప్రీత్ సేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్ (ఆంటిగువా): గత ఏడాది ఐసీసీ మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైన భారత్ గురువారం జరిగే ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకునే దిశగా యోచిస్తోంది. సెమీస్‌లో గెలుపు ద్వారా గత విషాద ఘట్టాలను చెరపాలని హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా గట్టి పోరాటం ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. గత ఏడాది జరిగిన 50 ఓవర్ల వరల్డ్ కప్‌లో కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసిన భారత్ ఇపుడు అదే ప్రత్యర్థితో జరిగే సెమీఫైనల్స్‌లో గెలుపు ద్వారా కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. టీ-20 వరల్డ్ కప్‌లో ఇప్పటికే ఆడిన మ్యాచ్‌లలో బలమైన జట్లు న్యూజిలాండ్‌పై 34 పరుగులు, ఆస్ట్రేలియాపై 48 పరుగుల తేడాతో ఘన విజయాన్ని హర్మన్‌ప్రీత్ సేన నమోదు చేసింది. లీగ్ దశలోని అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన భారత్‌కు గురువారం ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. సీనియర్ ఆటగాళ్లు మిథాలీరాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి బ్యాట్స్‌ఉమెన్‌లతోపాటు కేవలం అనుజా పాటిల్ వంటి ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగి విజయాల దిశగా దూసుకుపోతున్న టీమిండియాను లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్, రాధా యాదవ్, ఆఫ్‌స్పిన్నర్లు దీప్తి శర్మ, దయాలన్ హేమలత, అరుంధతిరెడ్డి, మాన్షీ జోషి వంటి వారు గట్టెక్కించగలరని జట్టు యాజమాన్యం బలంగా నమ్ముతోంది. గ్రూప్ మ్యాచ్‌లు జరిగిన గుయానాలోని ప్రొవిడెన్స్ మైదానంలో ఇంగ్లాండ్‌ను భారత్ ఢీకొంటుంది. మరోపక్క ప్రత్యర్థి ఇంగ్లాండ్ కూడా తమ బౌలర్లపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆన్యా సుబ్రోసోల్, నటాలీ సీవర్, డేనీ వ్యాట్‌తోపాటు కెప్టెన్ హీథర్ నైట్ వంటివారితో బరిలోకి దిగుతున్నందున సెమీఫైనల్స్ హోరాహోరీగా జరుగనుంది.