క్రీడాభూమి

రెండో టీ-20 వర్షార్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: భారత్-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన రెండో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కల్పించాడు. తొలుత టాస్ గెలిచిన కోహ్లీ సేన బౌలింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్‌ను ప్రారంభించిన ఆసిస్ 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తొలి టీ-20 మాదిరిగానే రెండో టీ-20కి కూడా వరుణుడు అడ్డుపడడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్‌కు 19 ఓవర్లలో 137 పరుగుల లక్ష్యం విధించారు. అయితే, అప్పటికే కురుస్తున్న వర్షం ఎంతసేపటికీ తగ్గే సూచనలు కన్పించకపోవడంతో భారత్ లక్ష్యాన్ని మరింత కుదించి 11 ఓవర్లకు 90 పరుగుల లక్ష్యంగా నిర్ణయించారు. వర్షం ఆగకపోవడంతో చివరకు 5 ఓవర్లలో 45 పరుగుల లక్ష్యం విధించారు. భారత్ టార్గెట్ రెండుసార్లు మరింత తక్కువ చేసినా వరుణుడు పట్టువిడిచే దాఖలాలు కనిపించకపోవడంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. మూడు టీ-20లో ఇప్పటికే గబ్బాలో జరిగిన తొలి టీ-20లో భారత్ 4 పరుగుల తేడాతో ఆసిస్ చేతిలో పరాజయం పాలైంది. ఇపుడు మెల్బోర్న్‌లో జరిగిన రెండో టీ-20కి వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో టీ-20 సిరీస్‌ను సమం చేయాలంటే ఆఖరిది, మూడోది అయినా మ్యాచ్‌లో కోహ్లీ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఇదిలావుండగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా బెన్ మెక్‌డెర్మాట్ (32) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన పరుగులు సాధించలేకపోయారు. ముఖ్యంగా తొలి మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులతో తేడాతో ఓటమిని చవిచూసిన భారత్ రెండో మ్యాచ్‌లో పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా బౌలర్లను బలంగా నమ్ముకుంది. దీంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లు పరుగులు పారించకుండా పటిష్టమైన బౌలింగ్‌తో టీమిండియా పేసర్లు విజృంభించారు. దీంతో ఆసిస్ బ్యాట్స్‌మెన్లు భారీగా పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. కెప్టెన్ అరోన్ ఫించ్ 1 బంతిని ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రిషబ్‌పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. క్రిస్ లీన్ 13 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, మరో బౌండరీతో 13 పరుగులు చేసి ఖలీల్ అహమ్మద్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. ఓపెనర్ డీఆర్సీ షార్ట్ 14 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతో 14 పరుగులు చేసి ఖలీల్ అహమ్మద్ చేతులో బౌల్డ్ అయ్యాడు. మార్కస్ స్టోల్‌నిస్ 5 బంతులు ఎదుర్కొని 1 ఫోర్‌తో 4 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో దినేష్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 22 బంతులు ఎదుర్కొన్న గ్లెన్ మాక్స్‌వెల్ 1 ఫోర్‌తో 19 పరుగులు చేసి కృనాల్ పాండ్య చేతిలో బౌల్డ్ అయ్యాడు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 6 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ ముఖం పట్టాడు. 9 బంతులు ఎదుర్కొన్న నాథన్ కౌల్టర్ నైల్ 2 సిక్సర్లు, 1 ఫోర్‌తో 18 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు. బెన్ మెక్‌డెర్మాట్ 30 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, 2 ఫోర్లతో 32, ఆండ్రూ టై 13 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లలో 20, ఖలీల్ అహమ్మద్ 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి తలో రెండు వికెట్లు తీసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 20, కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 23, కునాల్ పాండ్య 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి చెరో వికెట్ పడగొట్టారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ-20 ఈనెల 25న సిడ్నీలో జరుగుతుంది.