క్రీడాభూమి

సోనియా చాహల్‌కు రజతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ దిశగా అంచెలంచెలుగా దాటుతూ వెళ్లిన మరో భారత బాక్సర్ 21 ఏళ్ల సోనియా చాహల్ ఫైనల్ పోరులో రజతంతో సరిపెట్టుకుంది. 57 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన వాహ్‌నెర్ ఒర్నెల్లా గాబ్రీలీ చేతిలో 4-1 తేడాతో పరాజయం పాలైంది. ఆఖరి పోరులో 29-28, 29-28, 28-29, 29-28, 29-28 తేడాతో ఓడిపోయింది. హర్యానాలోని భివానీ జిల్లా రూర్కీకి చెందిన సోనియా చాహల్ ప్రపంచ టోర్నమెంట్‌లో తొలిసారిగా బరిలోకి దిగి భారత్‌కు మరో స్వర్ణం అందిస్తున్న అభిమానుల అంచనాలు తలకిందులైనా రజతం దక్కడం గొప్ప విషయం. కాగా, మ్యాచ్ అనంతరం సోనియా చాహల్ మాట్లాడుతూ తన శక్తిసామర్థ్యాలను ఉపయోగించి పోరాడానని, కానీ తన కంటే ప్రత్యర్థి బాగా ఆడిందని, అయినా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొంది. తన తదుపరి కర్తవ్యం 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌పైనేనని, అందుకు అనుగుణంగా తనలోని లోపాలను ఇప్పటినుంచే సరిదిద్దుకుని గట్టిగా కృషి చేయడం ద్వారా బరిలోకి దిగుతానని తెలిపింది.