క్రీడాభూమి

టీమిండియాకు చావో రేవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: ఇప్పటికే 7 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన కోహ్లీ సేన ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో భాగంగా తొలి పోరులో తొలిసారిగా ఓటమిని చవిచూసింది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించడంతో నిర్వాహకులు రద్దు చేశారు. తొలి మ్యాచ్‌లో కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైన టీమిండియా మెల్బోర్న్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసి సిరీస్‌ను 1-1తో సమం చేయాలనుకున్నా వరుణుడు కనికరించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ రెండు జట్ల మధ్య టీ-20 సిరీస్‌లో ఆఖరిది, మూడో మ్యాచ్ సిడ్నీలో జరుగుతుంది. ఈ ఫైనల్ పోరు ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా ఇప్పటికే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ను కైవసం చేసుకున్న ఆసిస్ ఆఖరి మ్యాచ్‌లో కోహ్లీ సేనపై ఆధిపత్యం చెలాయించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, టీమిండియా తొలి మ్యాచ్‌ను తృటిలో చేజార్చుకున్నా రెండో మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఇక పరువు నిలుపుకోవాలంటే తప్పనిసరిగా సిరీస్‌లో మిగిలిన ఆఖరి మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఫైనల్ పోరులో విజయం సాధించడం ద్వారా కనీసం సిరీస్‌ను సమం చేయాలని కోహ్లీ సేన యోచిస్తోంది. ఇటీవల కాలంలో భారత్ భిన్న వాతావరణ పరిస్థితులు కలిగిన వివిధ దేశాల్లో పలు జట్లతో ఆడిన 27 టీ-20ల్లో 20 మ్యాచ్‌లలో గెలుపొందింది. 2017 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 9 టీ-20 సిరీస్‌లను కైవసం చేసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
స్టాన్‌లేక్ స్థానే స్టార్క్
ఆస్ట్రేలియా జట్టులో గాయపడిన బిల్లీ స్టాన్‌లేక్ స్థానంలో పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఆదివారం టీమిండియాతో జరిగే టీ-20 ఫైనల్ మ్యాచ్‌లో జట్టులోకి తీసుకోనున్నారు. మెల్బోర్న్‌లో జరిగిన రెండో టీ-20లో క్యాచ్ పట్టే సమయంలో స్టాన్‌లేక్ గాయపడ్డాడు. వాస్తవానికి భారత్‌తో జరిగే టీ-20 సిరీస్‌లో ఆసిస్ తరఫున ఆడే జట్టు నుంచి పేసర్ స్టార్క్‌కు విశ్రాంతి ఇచ్చారు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తా చాటగలిగే స్టాన్‌లేక్ స్థానంలో స్టార్క్ పేరును యాజమాన్యం ప్రతిపాదించింది.