క్రీడాభూమి

ఒలింపిక్స్‌లో.. గోల్డ్‌మెడల్ నా కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రానున్న ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించడమే తన ముందున్న ప్రథమ కర్తవ్యమని భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం ఎం.సీ.మేరీ కోమ్ తెలిపింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు గోల్డ్‌మెడల్ అందించడంతో పాటు తన వ్యక్తిగత ఖాతాలో మేరీ కోమ్ ఆరోసారి ఈ వరల్డ్ టైటిల్‌ను జమ చేసుకుంది. 36 ఏళ్ల మేరీ కోమ్ తాజా ప్రపంచ బాక్సింగ్‌లో భారత్ ఏడు పతకాలు అందుకోగా బంగారు పతకాన్ని మరోసారి ముద్దాడిన ఘనతను సాధించింది. 32012లో జరిగిన ఒలింపిక్స్‌లో నేను కాంస్య పతకాన్ని అందుకున్నాను. కానీ నా చిరకాల కల, వాంఛ గోల్డ్ మెడల్‌పైనే. ప్రస్తుతం జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సాధించిన ప్రగతితో ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇది రానున్న టోక్యో ఒలింపిక్స్‌లో మరో బంగారు పతకం సాధించేందుకు మరింత నమ్మకాన్ని పెంచింది2 అని ఇక్కడ ఇక్కడి జేఎల్‌ఎన్ స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్ సందర్భంగా మీడియాతో మేరీ కోమ్ కాసేపు మాట్లాడుతూ వ్యాఖ్యానించింది. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్‌ను భారత్‌కు అందించేందుకు రెండు మూడింతలుగా శ్రమ, కృషి, పట్టుదలతో ఇప్పటినుంచే కఠోర శిక్షణ పొందుతానని పేర్కొంది. అథ్లెటిక్స్ ఈవెంట్‌లో పాల్గొన్న కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి సంక్షేమ మంత్రి మేనకా గాంధీ మాట్లాడుతూ మేరీ కోమ్‌ను 3జాతీయ సంపద2గా అభివర్ణించింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరుసార్లు బంగారు పతకాలు సాధించిన దిగ్గజ అథ్లెట్ ఇక్కడి చిన్నారుల్లో మరింత క్రీడాస్ఫూర్తిని నింపేందుకు హాజరు కావడం గొప్ప విషయమని పేర్కొంది.