క్రీడాభూమి

ఆ తప్పు నాది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, నవంబర్ 29: ఈ ఏడాది దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లినప్పుడు బ్యాట్స్‌మన్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన సంఘటనలో తనపై బురద చల్లడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆరోపించాడు. ట్యాంపరింగ్ తప్పు తనది కాదని స్పష్టం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని, ఆ క్రమంలో ప్రత్యర్థి ఆటగాళ్లను హేళన చేయడం (స్లెడ్జింగ్), వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలతో వేధించడం తప్పుకాదన్నది క్లార్క్ అనుసరించిన సూత్రం. దీనితో మొండితనం, అహంభావం ఆస్ట్రేలియా క్రికెటర్ల లక్షణాలుగా మారాయని, ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలకు ప్రధాన కారణం వారు అనుసరిస్తున్న వైఖరేనని స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్, రచయిత గెరార్డ్ వాట్లే చేసిన వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెట్‌లో దుమారం రేపాయి. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లనప్పుడు, ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంరింగ్‌కు పాల్పడిన సంఘటన సంచలనం ఆ జట్టు ప్రతిష్టను దెబ్బతీసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో, అప్పటి జట్టు కెప్టెన్ స్టీవెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, వీరిద్దరి సూచనలతో బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించిన బాన్‌క్రాఫ్ట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సస్పెండ్ చేయడం కూడా విదితమే. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన ఈ సంఘటన కారణంగానే చీఫ్ కోచ్ డారెన్ లీమన్ తన పదవి నుంచి తప్పుకొన్నాడు. సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గేమ్స్ సదర్లాండ్, జట్టు ఫర్ఫార్మెన్స్ చీఫ్ పాట్ హోవర్డ్ సైతం నైతిక బాధ్యతగా తమతమ పదవులను వదులుకోక తప్పలేదు. భారత జట్టు ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో బాల్ ట్యాంపరింగ్ ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరందుకున్నాయి. గతంలో క్లార్క్ అనుసరించిన విధానాలే ఆస్ట్రేలియా క్రికెటర్లు విజయాల కోసం అడ్డదారులు తొక్కడానికి కారణమైందని వాట్లే చేసిన విమర్శ చర్చనీయాంశమైంది. సీఏ సైతం ఇలాంటి అభిప్రాయంతోనే ఉందని వార్తలు వచ్చాయి. అయితే, తనపై వాట్లే చేసిన ఆరోపణను క్లార్క్ తోసిపుచ్చాడు. యుద్ధంలో గెలవాలంటే ప్రత్యర్థులపై కనికరం లేకుండా పోరాడాల్సిందేనని స్పష్టం చేశాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరించడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించాడు. అయితే, బాల్ ట్యాంపరింగ్ వంటి అడ్డదారులు వెతుక్కోరాదని హితవు పలికాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యుడిగాగానీ, కెప్టెన్‌గాగానీ తాను ఎన్నడూ ట్యాంపరింగ్ వంటి క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన వ్యవహార శైలికి పాల్పడలేదని, ప్రోత్సహించలేదని పేర్కొన్నాడు. వాట్లే అనవసరంగా ఈ వివాదంలోకి తన పేరును చేర్చాడాడని ఆరోపించాడు.