క్రీడాభూమి

చిరకాల స్వప్నం నెరవేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, నవంబర్ 30: ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు 43 ఏళ్ల నుంచి ఊరిస్తున్న చిరకాల స్వప్నాన్ని రుజువు చేస్తూ ఘన విజయం సాధించాలని ఆస్ట్రేలియా కోచ్ రిక్ చార్లెస్‌వర్త్ హితవు పలికాడు. 2008 సంవత్సరంలో భారత పురుషులు, మహిళల హాకీ జట్లకు సాంకేతిక సలహాదారుగా వ్యవహరించిన రిక్ శుక్రవారం ఇక్కడ పీటీఐ ప్రతినిధితో మాట్లాడాడు. ‘ప్రస్తుతం భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 10వ ప్రపంచ హాకీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం జట్టు ఎంతో పురోభివృద్ధి సాధించింది. ప్రపంచ కప్ టైటిల్‌ను మరోమారు చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. నా అంచనా ప్రకారం దశాబ్దాల కల నెలవేరి అత్యున్నత పతకం అందుకుంటుంది’ అని 66 ఏళ్ల రిక్ చార్లెస్‌వర్త్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం టీమిండియా సర్దార్ సింగ్, రూపేందర్‌పాల్ సింగ్, ఎస్.వీ.సునీల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు లేకపోయినా బలమైన టీమ్‌గా ఉందని అన్నాడు. రిక్ చార్లెస్‌వర్త్ మార్గదర్శకత్వంలో ఆస్ట్రేలియా 2010, 2014లో వరల్డ్ కప్ టైటిల్ చేజిక్కించుకుంది.