క్రీడాభూమి

కోచ్ పొవార్ నిష్క్రమణతో మహిళా క్రికెట్‌లో వివాదానికి ఫుల్‌స్టాప్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: భారత మహిళా క్రికెట్ కోచ్ రమేష్ పొవార్ పదవీ కాలం శుక్రవారంనాటితో ముగియడంతో భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తే సద్దుమణిగినట్టేనని క్రీడాపండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో కొద్దిరోజుల కిందట జరిగిన ఐసీసీ మహిళా ప్రపంచ కప్ టీ-20 సెమీఫైనల్స్‌లో సీనియర్ క్రికెటర్ మిథాలీరాజ్‌ను తప్పించడంతో పెనుదుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. తనకు సెమీస్‌లో చోటు దక్కకుండా కోచ్ రమేష్ పొవార్‌తోపాటు సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ ప్రధాన కారకులంటూ మిథాలీరాజ్ ఆరోపించిన విషయం విధితమే. దీనిపై మిథాలీ, పొవార్, డయానా మధ్య పరోక్షంగా వాదోపవాదలు జరిగాయి. ముఖ్యంగా తన క్రీడాజీవితాన్ని నాశనం చేసేందుకు కోచ్ సహా కొందరు పెద్దలు కుట్రలు పన్నారంటూ మిథాలీరాజ్ బీసీసీఐ చైర్మన్‌కు సుదీర్ఘ లేఖ రాసింది. అయితే, మిథాలీరాజ్ వ్యవహారశైలి సరిగా లేదని, ఆమె ఎన్నడూ తమతో సహకరించే ధోరణితో లేదని పొవార్ తీవ్రంగా స్పందిస్తూ ఈ మేరకు బీసీసీఐకి తన సమాధానం చెప్పాడు. ఇదిలావుండగా, మహిళా క్రికెట్ కోచ్ రమేష్ పొవార్ మూడు నెలల తాత్కాలిక పదవీ కాలం శుక్రవారంనాడు ముగిసిన నేపథ్యంలో కొత్త కోచ్ నియామకానికి సంబంధించి అర్హులైన వారి నుంచి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే, మళ్లీ కోచ్ పదవికి భారత మాజీ స్పిన్నర్ పొవార్ సైతం దరఖాస్తు చేసుకుంటే దానిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పీటీఐ ప్రతినిధికి తెలిపారు.