క్రీడాభూమి

బౌలర్లు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: వచ్చే నెల 6 నుంచి అడెలైడ్ వేదికగా మొదలుకానున్న 4 టెస్టుల సిరీస్‌లలో భాగంగా టీమిండియా-క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్ మధ్య జరుగుతున్న నాలుగు రోజుల సన్నాహక మ్యాచ్‌లో మూడో రోజు భారత బౌలర్లు విఫలమయ్యారు. రెండోరోజు తొలి ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి టీమిండియా 358 పరుగులు చేయగా, ఆట ముగిసేసరికి ఆసిస్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు మ్యాచ్‌ను కొనసాగించిన ఆతిధ్య జట్టు ఆట ముగిసేసరికి 102 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా పర్యాటక జట్టు కంటే 2 పరుగుల వ్యత్యాసంలో ఉండగా, చేతిలో ఇంకా మరో 4 వికెట్లు ఉన్నాయి. భారత బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పూర్తి విఫలమయ్యారు. ఫలితంగా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్ మాక్స్ బ్రియాంట్ 65 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, 9 బౌండరీలతో 62 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ డీఆర్సీ షార్ట్ 91 బంతులు ఎదుర్కొని 11 బౌండరీలతో 74 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. 55 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ శామ్ వైట్‌మేన్ 4 బౌండరీలతో 35 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. పరమ్ ఉప్పల్ 22 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి రనౌట్‌గా వెనుతిరిగాడు. జాక్ కార్డర్ 139 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 38 పరుగులు చేసి మహమ్మద్ షమీ చేతిలో బౌల్డ్ అయ్యాడు.
జొనాథన్ మేరియో 13 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో రిషళ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ హేరీ నీల్సన్ 56 పరుగులతో, అరోన్ హర్డిల్ 69 పరుగులతో బరిలో ఉన్నారు. కాగా, భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 18 ఓవర్లలో 67 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఉమేష్ యాదవ్ 22 ఓవర్లలో 81, రవిచంద్రన్ అశ్విన్ 24 ఓవర్లలో 63 పరుగులిచ్చి తలో వికెట్ తీసుకున్నారు.