క్రీడాభూమి

ఐఎస్‌ఎస్‌ఎఫ్ జడ్జెస్ కమిటీ సభ్యుడిగా తొలి భారతీయుడు పవన్ సింగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్)లోని ఏడుగురు సభ్యులు కలిగిన జడ్జెస్ కమిటీలో ఒక సభ్యుడిగా భారత్‌కు చెందిన పవన్ సింగ్ ఎన్నిక కానున్నాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ)కి ప్రస్తుతం జాయింట్ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న పవన్ సింగ్ ఇండియన్ షూటింగ్ టీమ్‌కు మాజీ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌లోని ఏడుగురు సభ్యులు గల జడ్జెస్ కమిటీలో ఒక సభ్యుడి పోస్టు కోసం ప్రపంచవ్యాప్తంగా 22 మంది అభ్యర్థులు పోటీపడగా పవన్ సింగ్‌కు అరుదైన అవకాశం దక్కింది. పవన్ సింగ్ అధికారికంగా ఎన్నికైనట్టు త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయుడుగా రికార్డు పుటల్లోకి ఎక్కుతాడు.