క్రీడాభూమి

ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే పరుగులిచ్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, డిసెంబర్ 3: తమ దేశ జట్టుతో జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీసు మ్యాచ్‌లోనే భారత బౌలర్లు వందలాది పరుగులు సమర్పించుకున్నారని ఆసిస్ మాజీ బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్ వ్యాఖ్యానించాడు. ఈనెల 6 నుంచి ఆస్ట్రేలియా-్భర త్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా తమ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా గురించి చేసిన వ్యాఖ్యలపై జోన్స్ పైవిధంగా స్పందించాడు. టెస్టు సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన సన్నాహక మ్యాచ్‌లలో భారత బౌలర్లు 500కు పైగా పరుగులు సమర్పించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ తమ గడ్డపై బౌలింగ్ ఎంతకష్టమో వారికి తెలిసొచ్చిందని వ్యంగ్యంగా అన్నాడు. సన్నాహక మ్యాచ్ చివరకు డ్రా అయినప్పటికీ తమ బ్యాట్స్‌మన్ హ్యారీ నీల్సన్ ప్రత్యర్థి బౌలర్లను చితకబాదిన విషయాన్ని ప్రస్తావించాడు.

చిత్రం.. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్ వ్యాఖ్య