క్రీడాభూమి

టెస్టు ర్యాంకింగ్స్.. టీమిండియాకు ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, డిసెంబర్ 3: టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు. ఈనెల 6నుంచి ఆస్ట్రేలియా-్భరత్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం సిరీస్‌ను ప్రత్యర్థి 4-0తో గెల్చుకుంటేనే తొలిస్థానంలో నిలుస్తుంది. ఇప్పటివరకు ఆసిస్ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఇరు జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ డ్రా అయితే భారత్ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని, ఇపుడున్న అగ్రస్థానంలోనే నిలుస్తుందని ఐసీసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆసిస్-్భరత్ మధ్య గురువారం నుంచి నాలుగు టెస్టు సిరీస్‌లు జరుగనున్న నేపథ్యంలో భారత్ టెస్టు సిరీస్‌లో 116 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా 102 పాయింట్లతో ఉందని పేర్కొంది. టెస్టు సిరీస్‌లను భారత్ 4-0తో చేజిక్కించుకుంటే ఏకంగా 120 పాయింట్లకు ఎదుగుతుంది. సిరీస్‌లను కోల్పోతే 108 పాయింట్లకు దిగజారుతుంది. ఇరు జట్ల మధ్య పాయింట్ల తేడా కేవలం 14 ఉండడంతో సిరీస్‌లను కోల్పోతే ఆసిస్ 97 పాయింట్లకు దిగజారుతుంది. గెలిస్తే 110 పాయింట్లకు చేరుకుంటుంది. ఇదిలావుండగా, బ్యాటింగ్‌లో టాప్-10 స్థానాల్లో కొనసాగుతున్న ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నిషేధం ఎదుర్కొంటున్న ఆసిస్ బ్యాట్స్‌మన్ స్టీవ్, కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్‌లో రవీంద్ర జడేజా ఐదో స్థానాన్ని ఆక్రమించగా, రవిచంద్రన్ అశ్విన్ ఏడో స్థానంలో ఎలాంటి మార్పులేదు.