క్రీడాభూమి

పరువు నష్టం కేసులో గేల్ గెలిచాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ పరువు నష్టం కేసులో భారీ మొత్తాన్ని గెలిచాడు. ‘ది సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్ అండ్ ది ఏజ్’ పబ్లిషర్ ఫెయిర్‌ఫాక్స్ మీడియాపై తనపై చేసిన ఆరోపణలు, అభియోగాలు నిరూపించడంలో విఫలం కావడంతో 300,000 ఆస్ట్రేలియా డాలర్లు (221.000 అమెరికా డాలర్లు) సాధించాడు. 2015లో సిడ్నీ వరల్డ్ కప్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో క్రిస్ గేల్ ఒక మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడంటూ సదరు పత్రికలు 2106లో కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో అప్పటినుంచి కేసు విచారణ జరుగుతోంది. తనపై అనవసర ఆరోపణలు చేసిన పత్రికలపై క్రిస్ గేల్ గత ఏడాది పరువు నష్టం దావా వేశాడు. గేల్‌పై చేసిన ఆరోపణలను తగిన ఆధారాలతో నిరూపించలేకపోవడంతో దీనిపై విచారించిన న్యూ సౌత్ వేల్స్ సుప్రీంకోర్టు జస్టిస్ లూసీ మెక్‌కల్లమ్ తాజాగా సంచలన తీర్పును వెలువరించారు. దిగ్గజ ఆటగాడైన క్రిస్ గేల్ పరువు ప్రతిష్టలను మంటగలుపుతూ నిరాధార ఆరోపణలు ప్రచురించడంతో అతని హక్కులకు భంగం కలిగించినందుకు 300,000 ఆస్ట్రేలియా డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పారు.

చిత్రం.. గేల్