క్రీడాభూమి

మహిళా క్రికెట్ కోచ్ ప్యానల్‌లో కపిల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: మహిళా క్రికెట్ కోచ్‌ను ఎంపిక చేసే ప్యానల్ కమిటీలో దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్ సభ్యుడిగా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వివిధ కారణాల రీత్యా కొత్త కోచ్ ఎంపికలో బీసీసీఐ క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఆ బాధ్యతలను చేపట్టే ప్యానల్ కమిటీలో కపిల్‌దేవ్ భాగస్వామిగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవ ల మహిళా జట్టు కోచ్‌గా వ్యవహరించిన రమేష్ పొవార్ పదవీకాలం గతనెల 30తో ముగిసింది. అంతేకాకుండా సీనియర్ మహి ళా క్రికెటర్ మిథాలీరాజ్, కోచ్ పొవార్ మధ్య చెలరేగిన వివాదం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యం లో పవార్‌ను తప్పించడం, కొత్త కోచ్ ఎంపిక కోసం ఈనెల 15వర కు బీసీసీఐ సీఏసీ దరఖాస్తులు ఆహ్వానించనుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కోచ్ పదవికి సీఏసీకి అందిన దరఖాస్తులను పరిశీలించి ఇంట ర్వ్యూ ద్వారా అర్హులైనవారిని ఎంపిక చేయా ల్సి ఉంటుంది. కానీ ఈ కమిటీలో క్రికెట్ దిగ్గజ త్రయం సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ముందస్తు బాధ్యతలకు సంబంధించిన ప్రక్రియలో భాగస్వాములుగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ త్రయం ఆసక్తి ఉన్న వ్యక్తుల గురించి రాతపూర్వకంగా ఇస్తే దానిని సీఏసీ పరిశీలించే అ వకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోచ్ ఎంపికలో ప్రముఖ ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ పరిశీలిస్తోంది. ఇందులో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అంశుమాన్ గైక్వాడ్, శుభాంగి కుల్‌కర్ణి, శాంతా రంగస్వామి పేర్లు ఉండొచ్చునని తెలుస్తోంది. వీరిలో అందుబాటులో ఉన్న ముగ్గురు సభ్యులు గల ప్యా నల్ కమిటీలో గవాస్కర్ ఆసక్తి చూపకపోవచ్చునని, మరో దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కే ఎక్కువ అవకాశాలు ఉండవచ్చునని బీసీసీఐకి చెందిన ఒక అధికారి తెలిపాడు.

చిత్రం.. కపిల్‌దేవ్