క్రీడాభూమి

చాంగ్ వెయ్ ప్రాక్టీస్ త్వరలో మొదలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, డిసెంబర్ 6: కేన్సర్‌తో బాధపడుతూ కొంతకాలంగా అంతర్జాతీయ కెరీర్‌కు దూరమైన మలేసియా బాడ్మింటన్ సూపర్ స్టార్ లీ చాంగ్ వెయ్ త్వరలోనే మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నాడు. ముక్కుకు సంబంధించిన కేన్సర్ సోకడంతో అతను వైద్య చికిత్స పొందుతున్నాడు. అయితే, ప్రాక్టీస్ ప్రారంభించి, మళ్లీ కెరీర్‌ను కొనసాగించాలన్న పట్టుదలతో అతను ఉన్నాడని మలేసియా బాడ్మింటన్ సమాఖ్య చీఫ్ నొర్జా జకారియా ఒక ప్రకటనలో తెలిపాడు. త్వరోనే చాంగ్ వెయ్ ప్రాక్టీస్ మొదలు పెడతాడని అన్నాడు. కేన్సన్‌ను జయించి, అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడన్న ధీమా వ్యక్తం చేశాడు.