క్రీడాభూమి

నా ‘టాప్-5’లో ఒకటి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్: తాను ఆడిన ‘టాప్-5’ టెస్టు ఇన్నింగ్స్‌లో ఇదొకటని భారత బ్యాట్స్‌మన్, సెంచరీ హీరో చటేశ్వర్ పుజారా అన్నాడు. ఆస్ట్రేలియాతో గురువారం ఇక్కడ ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గొప్పగా ఆడిన అతను కెరీర్‌లో 16వ సెంచరీని నమోదు చేశాడు. మొదటి రోజు ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ జొహానె్నస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై, నాటింహామ్‌లో ఇంగ్లాండ్‌పై నమోదు చేసిన సెంచరీలను గుర్తుచేసుకున్నాడు. ఈ జాబితాలోకే ఆసీస్‌పై చేసిన శతకం వస్తుందని వ్యాఖ్యానించాడు. ఈ ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ మెరుగ్గా రాణించి ఉంటే బాగుండేదని అన్నాడు. విదేశాల్లో సెంచరీ సాధించినప్పుడు కలిగే అనందం అద్భుతమని పేర్కొన్నాడు.

చిత్రం..పూజారా రనౌట్