క్రీడాభూమి

శతకంతో ఆదుకున్న పుజారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్: ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా వీరోచిత ఇన్నింగ్స్ ఆడి, సెంచరీతో ఆదుకోవడంతో, ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు నష్టపోయి 250 పరుగులు చేయగలిగింది. ఒకానొక దశలో 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు పుజారా ఒంటరి పోరాటం జరిపి అండగా నిలిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కేవలం మూడు పరుగుల స్కోరువద్ద లోకేష్ రాహుల్ వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు చేసిన అతను ఆరోన్ ఫించ్ క్యాచ్ అందుకోగా, జొస్ హాజల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 22 బంతులు ఎదుర్కొని, 11 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు దొరికిపోయాడు. మరో నాలుగు పరుగుల తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కూడా కూలింది. ఆసీస్ పేసర్లను ఎదుర్కొనేందుకు నానా ఇబ్బందులు పడిన అతను 16 బంతుల్లో మూడు పరుగులు చేసి, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాజా చక్కటి క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. జొస్ హాజల్‌వుడ్ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్‌కోమ్‌కు చిక్కిన అజింక్య రహానే 13 పరుగులు చేశాడు. అప్పటి వరకూ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతున్న పుజారాకు రోహిత్ శర్మ అండగా నిలిచే ప్రయత్నం చేశాడు. వీరి భాగస్వామ్యంలో భారత్ ఇన్నింగ్స్ కుదుటపడే అవకాశాలు కనిపించాయి. కానీ, 61 బంతుల్లో 37 పరుగులు చేసిన అతనిని మార్కస్ హారిస్ క్యాచ్ పట్టగా, నాథన్ లియాన్ ఔట్ చేశాడు. రిషభ్ పంత్ (25) వికెట్ కూడా లియాన్‌కు లభించింది. టిమ్ పైన్ క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్‌కోమ్ క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. నాలుగు పరుగులు చేసిన ఇశాంత్ శర్మను మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాగా, కెరీర్‌లో 16వ శతకాన్ని నమోదు చేసిన పుజారా 246 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. అతని ఔటైన వెంటనే తొలి రోజు ఆట ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు. ఆప్పటికి భారత్ 87.5 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేయగా, మహమ్మద్ షమీ ఆరు పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, జొస్ హాజెల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లియాన్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.

చిత్రం..సెంచరీ హీరో పూజారా