క్రీడాభూమి

ధోనీ సరసన పంత్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్‌: ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు పట్టడం ద్వారా టీమిండియా యువ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ భారత మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ సరసన చేరాడు. ఆస్ట్రేలియాతో అడెలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 6 క్యాచ్‌లు పట్టాడు. 21 ఏళ్ల రిషబ్ పంత్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ తొలిరోజున ఉస్మాన్ ఖాజా, పీటర్ హ్యాండ్‌కాంబ్, టిమ్ పైన్‌లను క్యాచ్‌లతో పెవిలియన్ దారివైపు పంపగా, రెండోరోజు మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, జోష్ హజల్‌వుడ్ క్యాచ్‌లను పట్టుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2009 న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన టెస్టు సిరీస్ తొలి ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు పట్టుకుని రికార్డు సృష్టించాడు.