క్రీడాభూమి

టెస్టుల్లో కోహ్లీ మరో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టు మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా అడెలైడ్‌లో తొలి టెస్టు సిరీస్‌లో భారత్ తొలి ఆడుతున్న నేపథ్యంలో శనివారం జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ టెస్టుల్లో త్వరితగతిన 1,000 పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు పుటల్లో చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనతతో కోహ్లీ టెస్టుల్లో త్వరితగతిన వెయ్యి లేదా అంతకుపైగా పరుగులు చేసిన భారత నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు. సచిన్ తెండూల్కర్ (1809), వీవీఎస్ లక్ష్మణ్ (1236), రాహుల్ ద్రవిడ్ (1143) సరసన కోహ్లీ చేరాడు. కెప్టెన్‌గా కోహ్లీ టెస్టుల్లో 2,000 పరుగుల మైలురాయిని సైతం అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా గడ్డపై కేవలం 18 ఇన్నింగ్స్‌లోనే త్వరితగతిన 1000 పరుగుల మార్క్‌ను అందుకున్న క్రికెటర్ల జాబితాలో కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో 1000 పరుగులు చేసిన ఆటగాళ్లలో 28వ క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.