క్రీడాభూమి

ఆధిక్యం దిశగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్: భారత్-ఆస్ట్రేలియా మధ్య అడెలైడ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ ఆట ముగిసేసరికి టీమిండియా ప్రత్యర్థిపై 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆడిన ఆతిధ్య జట్టు ఆట ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసిస్ అదనంగా 44 పరుగులు జోడించి 98.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కోహ్లీ సేన శనివారం ఆట ముగిసేసరికి 61 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థిపై 166 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. 191 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసిస్ టీమ్‌లో రెండోరోజు క్రీజులో ఉన్న ట్రావిస్ హెడ్ మూడోరోజు తన ఆటను కొనసాగించి 167 బంతులు ఎదుర్కొని 6 బౌండరీలతో 72 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. మిచెల్ స్టార్క్ 34 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 15 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. జోష్ హజల్‌వుడ్ 1 బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే మహమ్మద్ షమీ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. లియాన్ నాథన్ 28 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, 2 బౌండరీలతో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాకు చెరి మూడు వికెట్లు, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీకి తలో రెండు వికెట్లు దక్కాయి.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కోహ్లీ సేన ఆట ముగిసేసరికి 61 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ 53 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ 67 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, 3 బౌండరీలతో 44 పరుగులు చేసి హజల్‌వుడ్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ ముఖం పట్టాడు. 104 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ 3 బౌండరీలతో 34 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో అరోన్ ఫించ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆట ముగిసేసరికి చటేశ్వర్ పుజారా 40, అజింక్య రహానే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఆసిస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 10 ఓవర్లలో 18 పరుగులు, జోష్ హజల్‌వుడ్ 16 ఓవర్లలో 25, నాథన్ లియాన్ 22 ఓవర్లలో 48 పరుగులిచ్చి తలో వికెట్ తీసుకున్నారు.
*
సంక్షిప్త స్కోరు
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 250 ఆలౌట్.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 98.4 ఓవర్లలో 235 ఆలౌట్. ట్రావిస్ హెడ్ 72, పీటర్ హ్యాండ్స్‌కాంబ్ 34 (అశ్విన్ 57/3, జస్ప్రీత్ బు మ్రా 47/3, ఇషాంత్ శర్మ 47/2, షమీ 58/2).
టీమిండియా రెండో ఇన్సింగ్స్: మూడో రోజు ఆట ముగిసేసరికి 61 ఓవర్లలో 3/151. లోకోష్ రాహుల్ 44, మురళీ విజయ్ 40, విరాట్ కోహ్లీ 34 (మిచెల్ స్టార్క్ 10/1, జోష్ హాజల్‌వుడ్ 16/1, నాథన్ లియాన్ 22/1).
చిత్రం..జస్ప్రీత్ బుమ్రా (47/3)