క్రీడాభూమి

తమిళ్ తలైవాస్‌పై పింక్ పాంథర్స్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), డిసెంబర్ 9: ప్రొ-కబడ్డీ సీజన్-6లో భాగంగా విశాఖలో జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య ఆదివారం జరిగిన పోటీలో పింక్ పాంథర్స్ 37-24 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభంలో 8-8 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ పింక్ పాంథర్స్ ఆటగాడు దీపక్ హుడా ఆలౌట్ చేయడంతో ఎనిమిది పాయింట్లు దక్కించుకుని 16-8కి స్కోరు చేరుకుంది. విరామ సమయానికి 17-10 పాయింట్లతో ఉన్న ఇరు జట్లు ద్వితీయార్ధంలో పింక్ పాంథర్స్ జట్టు మరింత విజృంభించింది. రైడింగ్‌లో అద్వితీయ ప్రతిభ కనబరచిన దీపక్ హుడా 8 పాయింట్లు సాధించాడు. సునీల్ డిఫెన్స్‌లో 4 పాయింట్లు సాధించాడు. పింక్ పాంథర్స్ జట్టు ద్వితీయార్ధంలోనే 13 పాయింట్లు సాధించడం విశేషం. తమిళ్ తలైవాస్ జట్టులో సురేష్ హెగ్డే ఆరు పాయింట్లు సాధించగా, చివర్లో సబ్సిట్యూట్‌గా వచ్చిన విదేశీ ఆటగాడు 4 పాయింట్లు సాధించాడు.