క్రీడాభూమి

కష్టమే.. అసాధ్యం కాదు : లియాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, డిసెంబర్ 9: భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో డ్రాతో గట్టెక్కుతామని ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఆరు వికెట్లను కూల్చడం ద్వారా రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను కట్టడి చేసిన లియాన్ నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడారు. దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ ఇదే విధంగా కష్టాల్లో పడినప్పటికీ మ్యాచ్‌ని డ్రాగా ముగించామని గుర్తు చేశాడు. అదే ఫలితం పునరావృతమవుతుందని జోస్యం చెప్పాడు. చివరి రోజున చేతిలో ఉన్న ఆరు వికెట్లను కాపాడుకుంటూ మ్యాచ్‌ని డ్రా చేయడం కష్టమేగానీ అసాధ్యం మాత్రం కాదని లియాన్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు.

చిత్రం..లియాన్