క్రీడాభూమి

ధోనీ నుంచి స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 11: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచే వికెట్‌కీపర్‌లో స్ఫూర్తిని పొందానని, అతనే తనకు నిజమైన హీరోననీ యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. ఆస్ట్రేలియాతో అడెలైడ్‌లో జరిగిన మొదటి టెస్టులో మొత్తం 11 క్యాచ్‌లు పట్టి, ప్రపంచ రికార్డును సమం చేసిన అతను మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ చలించకుండా ఏ విధంగా ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించాలో, సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలో అతనే తనకు చెప్పాడని జాక్ రసెల్, ఏబీ డివిలియర్స్ ఒక టెస్టు మ్యాచ్‌లో మొత్తం పదకొండు క్యాచ్‌లతో నెలకొల్పిన రికార్డును చేరిన పంత్ అన్నాడు. ధోనీ తనకే కాకుండా యావత్ దేశానికే హీరో అని వ్యాఖ్యానించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టడం ద్వారా ధోనీ రికార్డును సమం చేయడమేగాక, భారత్ తరఫున 10 క్యాచ్‌లతో వృద్ధిమాన్ సాహా పేరిట ఉన్న రికార్డును అధిగమించినందుకు ఎంతో ఆనందంగా ఉన్నదని చెప్పిడు. ధోనీ నుంచి నేర్చుకున్న ఎన్నో పాఠాలు మైదానంలో తనకు ఉపయోగపడ్డాయని పంత్ తెలిపాడు. తనకు ఎలాంటి సమస్య ఎదురైనా ముందుగా ధోనీతోనే చెప్తాడని, అతని వద్ద ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం లభిస్తుందని అన్నాడు. ఒక ఆటగాడిగా, ప్రత్యేకించి వికెట్‌కీపర్‌గా సేవలు అందించాలంటే ఎంతటి ఓర్పు ఉండాలనే విషయాన్ని ధోనీ నుంచే నేర్చుకున్నానని పంత్ అన్నాడు. సాధ్యమైనంత వరకూ ప్రశాంతంగా ఉండడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమని ధోనీ నిరూపించాడని, అతని మార్గాన్ని అనుసరించడమే తన లాంటి ఆటగాళ్ల కర్తవ్యమని చెప్పాడు. రికార్డుల గురించి తాను ఎక్కువగా ఆలోచించడం లేదని, ఈ ఘనత అందుకున్నంత మాత్రాన తనను తాను గొప్పవాడిగా భావించడం లేదని స్పష్టం చేశాడు.