క్రీడాభూమి

ఆసీస్‌కే అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 11: పెర్త్ స్టేడియంలో పిచ్ భారత్ కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువ అనుకూలంగా ఉంటుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అడెలైడ్‌లో ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టును 31 పరుగుల తేడాతో కైవసం చేసుకున్న భారత్ నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన విషయం తెలిసిందే. 70 ఏళ్ల కాలంలో ఆస్ట్రేలియాలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొంటూ, మొదటి టెస్టునే తన ఖాతాలో వేసుకోవడం భారత్‌కు ఇదే మొదటిసారి కావడం గమనార్హం. శుక్రవారం నుంచి ఇరు జట్లు రెండో టెస్టులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పాంటింగ్ విలేఖరులతో మాట్లాడుతూ, అడెలైడ్‌తో పోలిస్తే, పెర్త్‌లో వికెట్ ఆస్ట్రేలియా బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అన్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎదురుదాడికి దిగాలని ఆసీస్ జట్టుకు సూచించాడు. మొదటి టెస్టులో ఆసీస్ ఆట తీరు నిరాశపరచిందని అన్నాడు. అయితే, టీమిండియా కూడా తన స్థాయికి తగినట్టు ఆడలేదని స్పష్టం చేశాడు. చాలా తక్కువ తేడాతో ఫలితం వె లువడడం రాబోయే టెస్టుల్లో పోరు ఏ విధంగా ఉంటుందోనన్న విషయాన్ని స్పష్టం చేస్తుందని పాంటింగ్ తెలిపా డు. పెర్త్‌లో గెలిచి, మళ్లీ ఫామ్‌లోకి రావాలని ఆసీస్ ఆటగాళ్లకు పిలుపునిచ్చాడు. మొదటి టెస్టు ఆడిన జట్టే రెండో టెస్టులో బరిలోకి దిగాలని సూచించాడు. తరచు మార్పులుచేర్పులు జరిగితే, ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం తగ్గుతుందని అన్నాడు. పరాజయాల నుంచి ఆస్ట్రేలియా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఏ రకంగా చూసినా, రెండో టెస్టులో పోరు నువ్వా? నేనా? అన్న చందంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.