క్రీడాభూమి

టాప్‌లోనే కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమాయ్, డిసెంబర్ 11: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్, బ్యాటింగ్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అతను మొత్తం 920 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా, కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్) 913, స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా) 901 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా మళ్లీ టాప్-10లో చోటు దక్కింకున్నాడు. 846 పాయింట్లు సంపాదించిన అతనికి నాలుగో స్థానం లభించింది. జో రూట్ 807 పాయింట్లతో ఐదో స్థానాన్ని ఆక్రమించాడు. కాగా, బౌలింగ్ విభాగానికి వస్తే, రవిచంద్రన్ అశ్విన్ ‘టాప్-5’లో చోటును పదిలం చేసుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 33వ స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో కాగిసో రబదా (దక్షిణాఫ్రికా) 882 పాయింట్లు, జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్) 874 పాయింట్లు, వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా) 826 పాయింట్లు వరుసగా మొదటి మూడు స్థానాలను సంపాదించారు. పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ (821)కు నాలుగో స్థానం దక్కగా, అశ్విన్‌కు ఐదో స్థానం లభించింది. బుమ్రా 392 పాయింట్లతో 33వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే, ‘టాప్-5’లో రవీంద్ర జడేజా ఒక్కడికే భారత్ నుంచి చోటు దక్కింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో ఉన్నాడు.