క్రీడాభూమి

బిడబ్ల్యుఎఫ్ తాజా ర్యాంకింగ్స్‌తో ఏడుగురు భారత షట్లర్లకు ఒలింపిక్ బెర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడలకు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, జ్వాలా గుత్తా సహా ఏడుగురు భారత షట్లర్లు బెర్తులను ఖరారు చేసుకున్నారు. ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) గురువారం తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేయడంతో వీరికి అధికారికంగా ఒలింపిక్ బెర్తులు ఖరారయ్యాయి. గత ఏడాది మే 4వ తేదీ నుంచి ఈ ఏడాది మే 1వ తేదీ వరకు క్రీడాకారులు సాధించిన పాయింట్లను ఆధారంగా చేసుకుని బిడబ్ల్యుఎఫ్ విడుదల చేసిన ఈ ర్యాంకింగ్‌లు పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ఒలింపిక్ క్వాలిఫయర్లను నిర్ధేశించేందుకు ఉపయోగపడ్డాయి.
నాలుగేళ్ల క్రితం లండన్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడలకు భారత్ నుంచి ఐదుగురు షట్లర్లు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అప్పట్లో కాంస్య పతకం సాధించిన సైనా నెహ్వాల్ ఈ ఏడాది ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడోసారి ప్రాతినిధ్యం వహించనుండగా, మహిళల డబుల్స్ జోడీ జ్వాలా గుత్త, అశ్వనీ పొన్నప్ప రెండోసారి ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరితో పాటు ఈసారి పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, డబుల్స్ విభాగంలో మను అత్రి, బి.సుమిత్ రెడ్డి, మహిళల సింగిల్స్ విభాగంలో ‘తెలుగు తేజం’ పివి.సింధుకు తొలిసారి ఒలింపిక్ బెర్తులు లభించాయి. దీంతో భారత్ ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి ఇద్దరు క్రీడాకారిణులతో బరిలోకి దిగనుంది. రియో ఒలింపిక్స్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఇద్దరు క్రీడాకారిణులను బరిలోకి దింపనున్న ఇతర దేశాల్లో చైనా (లీ జెరుయి, వాంగ్ ఇహన్), జపాన్ (నొజోమీ ఒకుహరా, అకానే యమగుచి), కొరియా (సంగ్ జీ హ్యున్, బే ఇయాన్ జు) ఉన్నాయి.
దిగజారిన శ్రీకాంత్
ఇదిలావుంటే, బిడబ్ల్యుఎఫ్ విడుదల చేసిన తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల సింగిల్స్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఒక స్థానం దిగజారి 12వ స్థానానికి చేరుకోగా, అజయ్ జయరామ్ 20వ స్థానం నుంచి 21వ స్థానానికి, డబుల్స్ జోడీ మను అత్రి, బి.సుమిత్ రెడ్డి 19వ స్థానం నుంచి 20వ స్థానానికి దిగజారారు. అయితే మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సైనా నెహ్వాల్, పివి.సింధు వరుసగా 8, 10 స్థానాల్లోనే కొనసాగుతున్నప్పటికీ, 2010 కామనె్వల్త్ క్రీడల్లో చాంపియన్లుగా నిలిచి ఈ ఏడాది ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండోసారి ప్రాతినిధ్యం వహించబోతున్న జ్వాలా గుత్త, ఆమె భాగస్వామి అశ్వనీ పొన్నప్ప మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 14వ ర్యాంకుకు ఎగబాకారు.

చిత్రం జ్వాలా గుత్తా, సైనా నెహ్వాల్