క్రీడాభూమి

పతకాలు సాధిస్తా : సాక్షి మాలిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: రియో ఒలింపిక్స్‌లో ఎవరూ ఊహించని విధంగా కాంస్య పతకాన్ని సాధించి సంచలనం సృష్టించిన సాక్షి మాలిక్ ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో రాణించలే, అభిమానులను నిరాశ పరుస్తున్నది. అయితే, 2020 ఒలింపిక్స్‌సహా రాబోయే అన్ని అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
బుధవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాక్షి మాట్లాడుతూ ఆసియా క్రీడల్లో పతకాలు కైవసం చేసుకోలేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. కొన్ని సందర్భాల్లో విఫలమయ్యానని, కానీ, ఆ పరాజయాలను గురించి తాను ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. రాబోయే టోర్నీలో సత్తా చాటుతానని చెప్పింది. అందుకుగాను అనుక్షణం శ్రమిస్తున్నానని పేర్కొంది. పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నానని, మళ్లీ ఫామ్‌లోకి వస్తానని తెలిపింది. ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించడానికి ప్రయత్నిస్తానని, భారత్‌కు పతకాలు అందించేందుకు శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని సాక్షి అన్నది.