క్రీడాభూమి

వరల్డ్ కప్ హాకీ క్వార్టర్స్‌లో భారత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 13: ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్ పోటీల్లో నాలుగు దశాబ్దాలుగా సెమీస్ చేరలేకపోయిన భారత జట్టు మరోసారి విఫలమైంది. నెదర్లాండ్స్‌తో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 1-2 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. భారత్‌కు మ్యాచ్ 15వ నిమిషంలోనే ఆకాశ్‌దీప్ సింగ్ తొలి గోల్‌ను అందించాడు. అయితే, కొన్ని సెకన్ల తేడాలోనే థియెరీ బ్రిక్మన్ ద్వారా నెదర్లాండ్స్‌కు ఈక్వెలైజర్ లభించింది. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే వరకూ మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీ యార్థం మొదట్లో ఇరు జట్లు మితిమీరిన ఆత్మరక్షణ విధానాన్ని అనుసరించాయ. అయతే, మ్యాచ్ జరుగుతున్న కొద్దీ భారత్‌పై డచ్ ఆటగాళ్లు ఒత్తిడి పెంచారు. 50వ నిమిషంలో స్టార్ ఆటగా డు మిన్క్ వాన్ డెర్ వీర్డెన్ తనకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి, నెదర్లాండ్స్ ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. అనంత రం వ్యూహ్మకంగా ఆడిన నెదర్లాండ్స్ అదే తేడాతో విజయాన్ని న మోదు చేసింది.
కాగా, మరో క్వార్టర్ ఫైనల్‌లో జర్మనీని ఢీకొన్న బెల్జియం 2-1 తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ చేరింది. ఫైనల్‌లో అడుగు పెట్టడానికి ఆ జట్టు ఇంగ్లాండ్‌ను ఎదుర్కొంటుంది. బుధవారం నాటి క్వార్టర్ ఫైనల్‌లో అర్జెంటీనాను ఇంగ్లాండ్ 3-2 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.