క్రీడాభూమి

చివరి మ్యాచ్‌లో అదరగొట్టిన టైటాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్) : ప్రొ కబడ్డీ చివరి లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 44-36 పాయింట్ల తేడాతో పాట్నా పైరేట్స్ జట్టును చిత్తు చేసింది. దీంతో ఇక్కడ జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్ జట్టు మూడు ఓటములు, మూడు విజయాలతో మిశ్రమ ఫలితాలు సాధించింది. పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్డేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ కీలక ఆటగాడు రాహుల్ చౌదరి రైడింగ్‌లో చెలరేగిపోయాడు. విరామ సమయానికి 26-15 పాయింట్లతో ఆధిక్యతలో ఉన్న తెలుగు టైటాన్స్ జట్టులో రాహుల్‌చౌదరి ఒక్కడే పది పాయింట్లతో సూపర్-10 సాధించడం విశేషం. జట్టులో రాహుల్ 13 పాయింట్లు, నీలేష్ తొమ్మిది పాయింట్లతో రైడింగ్‌లో దుమ్మురేపగా, డిఫెన్స్‌లో అపుజూర్ నిఘానీ ఐదు పాయింట్లు, విశాల్ భరద్వాజ నాలుగు పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రథమార్థంలో రైడింగ్‌లో పూర్తి వైఫల్యం చెందిన పాట్నా పైరేట్స్ ఆటగాడుప్రదీప్ నెర్వాల్ ద్వితీయార్థంలో 12 పాయింట్లు సాధించి అద్భుతమైన ప్రతిభ కనబర్చినప్పటికీ సమయం మించిపోవడంతో ఫలితం లేకపోయింది. కాగా ఈ మ్యాచ్‌తో రాహుల్‌చౌదరి 800పాయింట్ల మైలురాయిని అధిగమించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు.

చిత్రం..పాట్నా ఆటగాడిని నిలువరిస్తున్న తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు