క్రీడాభూమి

హాకీ వరల్డ్ కప్ హ్యాట్రిక్ కోసం ఆసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 14: ఒడిషాలోని భువనేశ్వర్ కళింగ స్టేడియం వేదికగా జరుగుతున్న పురుషుల హాకీ వరల్డ్ కప్ తుది సమరానికి చేరువవుతోంది. ఫైనల్‌లో చోటుకోసం శనివారం ఆస్ట్రేలియా-నెదర్లాండ్ ఒకపక్క తలపడనుండగా, మరోపక్క ఇంగ్లాండ్‌తో బెల్జియం పోటీపడుతోంది. హాకీ వరల్డ్ కప్‌లో ఇప్పటికే రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్‌గా అవతరించిన ఆసిస్ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతోంది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో నెదర్లాండ్‌తో జరిగే పోరుతో పైచేయి సాధించడం ద్వారా ఫైనల్‌లో బెర్త్ ఖాయం చేసుకునేందుకు తహతహలాడుతోంది. 2010, 2014 వరల్డ్ కప్‌లో టైటిల్ చాంపియన్‌గా అవతరించిన మళ్లీ మరోసారి ప్రపంచ కిరీటాన్ని ముద్దాడేందుకు సర్వశక్తులు ప్రదర్శించేందుకు సిద్ధమైంది. అయితే, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న నెదర్లాండ్‌ను తక్కువగా అంచనా వేయలేం. ప్రత్యర్థిపై పైచేయి సాధించడం అంత సులువు కాదు. ఇప్పటికే మూడుసార్లు వరల్డ్ కప్ టైటిల్‌ను అందుకున్న నెదర్లాండ్స్‌కు 1998 నుండి మళ్లీ మరోసారి టైటిల్‌ను కైవసం చేజిక్కించుకునేందుకు గత 20 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఆశల సౌధంపై కనే్నసింది. మరోపక్క ఒలింపిక్ రజత పతక విజేత బెల్జియం శనివారం ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్స్‌లో చరిత్ర సృష్టించాలని తహతహలాడుతోంది.