క్రీడాభూమి

అశ్విన్‌కు గాయం భారత్‌కు లోటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 14: ఆస్ట్రేలియాతో పెర్త్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయం కారణంగా ఆడలేకపోవడం ఆ జట్టుకు తీరని లోటేనని ఆసిస్ మాజీ బ్యాట్స్‌మన్ మిచెల్ హస్సీ అన్నాడు. అడెలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడిన అశ్విన్ 6 వికెట్లు తీసుకున్నాడని, అలాంటి ఆఫ్‌స్పిన్నర్ ఇపుడు జరుగుతున్న రెండో టెస్టుకు అందుబాటులో లేకపోవడం టీమిండియా అంచనాలకు భిన్నంగా ఫలితం వచ్చే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో అశ్విన్ 86.5 ఓవర్లలో 149 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. అడెలైడ్ టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టుపై ఘన విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం పెర్త్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టెస్టు చరిత్రలోనే మూడోసారి నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతోంది.

బౌన్సీ పిచ్‌పై రాణించనున్న లియాన్
ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్
భారత్‌తో పచ్చని పెర్త్ మైదానం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు సిరీస్‌లో తమ ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లియాన్ అద్భుతంగా రాణించగలడనే బలమైన నమ్మకం తనకు ఉందని ఆసిస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. ఆకుపచ్చని పెర్త్ మైదానం బౌన్సింగ్‌కు ఎంతో మేలు చేకూరుస్తుందని కనుక తమ ఆఫ్‌స్పిన్నర్ లియాన్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నాడు. ఫించ్, మార్కస్ హ్యారిస్ భాగస్వామ్యంలో రెండో టెస్టు తొలిరోజు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. తొలిరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతోనే ఈ మైదానంపై విజయం సాధించగలమనే గట్టి నమ్మకం ఏర్పడిందని అన్నాడు. ఈ పిచ్‌పై లియాన్ నాథన్ తప్పకుండా అద్భుతం సృష్టిస్తాడని పేర్కొన్నాడు. అడెలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో 32 పరుగుల తేడాతో సిరీస్‌ను కోల్పోయిన తాము రెండో సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అన్నాడు.