క్రీడాభూమి

క్రమశిక్షణతోనే రాణించగలం : విహారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్‌లో ఆతిధ్య ఆసిస్‌తో జరుగుతున్న రెండో టె స్టు సిరీస్‌లో క్రమశిక్షణతో వ్యవహరించి బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థిపై రాణించగలమని టీమిండియా ఆల్‌రౌండర్ హనుమ విహారి అభిప్రాయపడ్డాడు. టీమిండియాలో గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో రెండో టెస్టులో చోటు దక్కించుకున్న ఈ ఆల్‌రౌండర్ తొలిరోజు తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. తొలిరోజు ఆతిథ్య జట్టు 112 పరుగులకు ఒక్క వికెట్ నష్టపోకుండా ఆడినపుడు తాము ఎలాంటి ఆందోళన చెందలేదని, బౌలర్లమంతా విజృంభించి ప్రత్యర్థి బ్యా ట్స్‌మెన్‌లను లక్ష్యం చేసుకుని ఆడడంతో 6 వికెట్లు కో ల్పోయి 277 పరుగులు చేసిందన్నాడు. టెస్టు సిరీస్‌లో ఈ తరహా సంఘటనలు సహజమేనని, ప్రత్యర్థి తమ ముందు ఎంత లక్ష్యం ఉంచినా ఆందోళన చెందకుండా క్రమశిక్షణతో కూడిన బ్యాటింగ్‌తోనే విజయం సాధించగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఆసిస్ శనివారం నాడు ప్రారంభించే తొలి ఇన్నింగ్స్ రెండోరోజులో 320 లోపు తాము కట్టడి చేయగలిగితే మ్యాచ్‌పై పట్టు సా ధించినట్టేనని అభిప్రాయపడ్డాడు. ఇందుకు తమకు ఎ న్నో సానుకూల అంశాలు దోహదపడతాయని నమ్ముతున్నామని, రెండోరోజు ఆట ప్రారంభమయ్యే తొలి గంట తమకు ఎంతో కీలకమని, తమ ప్రణాళికకు అనుగుణంగా రాణించగలమనే ధీమాను వ్యక్తం చేశాడు. తొలి ఇన్నింగ్స్ తొలిరోజులోని మూడు సెషన్స్‌లోనూ తాము అద్భుతంగా బౌలింగ్ చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ టెస్టు చరిత్రలో మూడోసారి నలుగురు పేసర్లతో ఇపుడు బరిలోకి దిగుతుండడంతో మేలు జరుగుతుందనే నమ్ముతున్నామని పేర్కొన్నాడు.

జడేజా లేకుండా పెర్త్ టెస్టా? ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మిచెల్ వాగన్
ఆసిస్‌తో పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్టు సిరీస్‌లో టీమిండియా కనీసం ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్ కూడా లేకుండానే బరిలోకి దిగడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మిచెల్ వాగన్ అన్నాడు. బలమైన ఆసిస్ జట్టుతో తలపడేందుకు ప్రస్తుతం రెండో టెస్టు ఆడుతున్న టీమిండియా నలుగురు పేసర్లను జట్టులోకి తీసుకుందని, కానీ రవీంద్ర జడేజా వంటి ప్రత్యేక స్పెషలిస్టుగా పేరుగాంచిన స్పిన్నర్‌ను విస్మరించి తప్పు చేసిందని అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టులో చోటు కోసం వేచిచూస్తున్న రవీంద్ర జడేజాకు మొండిచేయి చూపడాన్ని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సిరీస్‌ను ఆసిస్ గెల్చుకుంటుందని వ్యాఖ్యానించాడు. టీమిండియా చాలా కాలం తర్వాత ఐదోసారి స్పెషలిస్టు స్పిన్నర్ లేకుండా కేవలం పేసర్లనే నమ్ముకుని టెస్టు సిరీస్‌లో అడుగుపెడుతోంది.