క్రీడాభూమి

ఫైనల్‌లో సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువాంగ్‌జౌ, డిసెంబర్ 15: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్‌లో ఒలింపిక్ రజత పతక విజేత, భారత షట్లర్ పీవీ సింధు చోటుదక్కించుకుంది. గత ఏడాది జరిగిన ఇదే ఈవెంట్‌లో కేవలం రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న 23 ఏళ్ల సింధు శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో థాయిలాండ్ షట్లర్, 2013 వరల్డ్ చాంపియన్ రచ్‌నాక్ ఇంతనాన్‌ను 21-16, 25-23 తేడాతో ఓడించింది. 54 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో పైచేయి సాధించిన సింధు ఆదివారం జరిగే ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుకురాతో తలపడనుంది. కాగా, పు రుషుల ఈవెంట్‌లో పాల్గొన్న భారత షట్లర్ సమీర్ వర్మ చైనాకు చెందిన షి యూకీ చేతిలో పరాజయం పాలయ్యాడు.