క్రీడాభూమి

మహిళా క్రికెట్ కోచ్ రేసులో కిర్‌స్టన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: భారత మహిళా క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దక్షిణాఫ్రికాకు చెందిన 51 ఏళ్ల గ్యారీ కిర్‌స్టన్ పోటీ పడుతున్నట్టు ప్రకటించాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐసీసీ మహిళా వరల్డ్ కప్ టీ-20 సెమీఫైనల్స్‌లో ఉద్దేశపూర్వకంగానే తనకు జట్టులో చోటు కల్పించలేదని, ఇందుకు జట్టు ప్రధాన కోచ్ రమేష్ పొవార్‌తోపాటు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీపై సీనియర్ క్రికెటర్ మిథాలీరాజ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ అంశం చిలికిచిలికి గాలివానగా మారడంతో రమే ష్ పొవార్‌ను కోచ్ పదవి నుంచి తొలగిస్తూ సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ నిర్ణయం తీసుకున్నారు. పొవార్ తప్పుకున్నప్పటి నుంచి గత 15 రోజులుగా ఖాళీగా ఉన్న మహిళా టీమ్ ప్రధాన కోచ్ పదవి కోసం రమేష్ పొవార్ సహా న్యూజిలాండ్ క్రికెట్ మాజీ కోచ్ మైక్ హెస్సన్, మాజీ క్రికెటర్లు మనోజ్ ప్రభాకర్, హెర్చెల్లీ గిబ్స్, డిమిట్రీ మాస్క్‌రెన్‌హాస్ సహా పలువురు పోటీ పడుతున్నారు. 2008 నుంచి 2011 వరకు టీమిండియా పు రుషుల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా వ్యవహరించిన గ్యారీ కిర్‌స్టన్ ఇపు డు మహిళా జట్టు ప్రధాన కోచ్ పదవి రేసులో ఉన్నానని చెప్పకనే చెప్పాడు. కిర్‌స్టన్ కోచ్‌గా వ్యవహరించిన కాలంలో టీమిండియా పురుషుల జట్టు 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ను చేజిక్కించుకుంది. 2011 నుంచి 2013 వరకు కిర్‌స్టన్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి ప్రధాన కోచ్‌గా కిర్‌స్టన్ సేవలు అందిస్తున్నాడు. ఇదిలావుండగా మహిళా క్రికెట్ ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ లు నిర్వహించేందుకు వీలుగా అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది.