క్రీడాభూమి

తడ బడినా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్: ఆతిధ్య ఆస్ట్రేలియాతో పెర్త్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు సిరీస్‌లో శనివారం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. ఆదిలోనే కోహ్లీసేనకు రెండు వికెట్ల రూపంలో నష్టం జరిగింది. దీంతో కోలుకున్న కెప్టెన్ చటేశ్వర పుజారాతో కలసి టీ విరామం సరికి రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు జోడించారు. ఆ తర్వాత 24 పరుగుల వద్ద పుజారా కూడా పెవిలియన్ దారిపట్టడంతో జట్టును ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు విరాట్ కోహ్లీ, అజింక్య రహానే కీలక భూమిక పోషించారు. వీరిద్దరి భాగస్వామ్యంతో శనివారం తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి భారత్ 69 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కోహ్లీ 82, రహానే 51 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు 277/6 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను రెండోరోజు కొనసాగించిన ఆతిధ్య ఆసిస్ 108.3 ఓవర్లలో ఆలౌటైంది. రెండోరోజు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను టీమిండియా బౌలర్లు త్వరితగతిన కట్టడి చేశారు. ఆట ముగిసేసరికి 49 పరుగులు జోడించిన టిమ్ పైన్ సేన 16 పరుగుల తేడాతో చివరి 4 వికెట్లను కోల్పోయింది. శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లు ఆట ముగిసేసరికి అర్ధవంతమైన స్కోరును సాధించారు. 277 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టిమ్ పైన్ సేనలో 66 బంతులు ఎదుర్కొన్న ప్యాట్ కమిన్స్ 19 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్-వికెట్ కీపర్ టిమ్ పైన్ 89 బంతులు ఎదుర్కొని 5 బౌండరీలతో 38 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. 10 బంతులు ఎదుర్కొన్న మిచెల్ స్టార్క్ 6 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. జోష్ హజల్‌వుడ్ 1 బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. నాథన్ లియాన్ 8 బంతులు ఎదుర్కొని 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 20.3 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హనుమ విహారి 14 ఓవర్లలో 53, జస్ప్రీత్ బుమ్రా 26 ఓవర్లలో 53, ఉమేష్ యాదవ్ 23 ఓవర్లలో 78 పరుగులిచ్చి తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసేరికి 60 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు లోకేష్ రాహుల్, మురళీ విజయ్ నిరాశపరిచారు. 17 బంతులు ఎదుర్కొన్న లోకేష్ రాహుల్ 2 పరుగులు చేసి హాజల్‌వుడ్ చేతిలో, 12 బంతులు ఎదుర్కొన్న మరో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ పరుగుల ఖాతా తెరవకుండానే మిచెల్ స్టార్క్ చేతిలో బౌల్డ్ అయ్యారు. కేవలం 5.1 ఓవర్లలోనే కీలక ఆటగాళ్లు పెవిలియన్ ముఖం పట్టడంతో జట్టును ఆందోళన వెంటాడింది. అయితే, ఆ తర్వాత బరిలోకి దిగిన చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలసి స్కోరును పెంచారు. వీరిద్దరూ కలసి టీ విరామం సమయానికి 72 పరుగులు జోడించారు. 103 బంతులు ఎదుర్కొన్న చటేశ్వర్ పుజారా 1 బౌండరీతో 24 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన అజింక్య రహానేతో కలసి కోహ్లీ పరుగుల వరద పారించారు. వీరిద్దరి భాగస్వామ్యంతో 90 పరుగులు సాధించారు. ఆట ముగిసేసరికి 181 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 9 బౌండరీలతో 82, అజింక్య రహానే 103 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, 6 బౌండరీల సహాయంతో 51 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో తన 20వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 109 బంతులు ఎదుర్కొని ఈ టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. ఆసిస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 14 ఓవర్లలో 42 పరుగులిచ్చి 2 వికెట్లు, జొస్ హాజల్‌వుడ్ 16 ఓవర్లలో 50 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నారు.

ఇరు జట్ల సంక్షిప్త స్కోర్..

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 108.3 ఓవర్లలో 326 ఆలౌట్. (మార్కస్ హ్యారిస్ (బీ) హనుమ విహారి (సీ) అజింక్య రహానే 70, ట్రావిస్ హెడ్ (బీ) ఇషాంత్ శర్మ (సీ) ఇషాంత్ శర్మ 58, అరోన్ ఫించ్ ఎల్బీడబ్ల్యూ (బీ) జస్ప్రీత్ బుమ్రా 50, షాన్ మార్క్ (బీ) హనుమ విహారి (సీ) అజింక్య రహానమే 45, టిమ్ పైన్ ఎల్బీడబ్ల్యూ (బీ)జస్ప్రీత్ బుమ్రా 38).
వికెట్ల పతనం: ఇషాంత్ శర్మ 41/4, జస్ప్రీత్ బుమ్రా 53/2, హనుమ విహారి 53/2, ఉమేష్ యాదవ్ 78/2.
టీమిండియా తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ (బీ) మిచెల్ స్టార్క్ 0, లోకేశ్ రాహుల్ (బీ) హజల్‌వుడ్ 2, చటేశ్వర్ పుజారా (బీ) మిచెల్ స్టార్క్ (సీ) టిమ్ పైన్ 24, విరాట్ కోహ్లీ 82 (నాటౌట్), రహానే 51 (నాటౌట్). రెండోరోజు ఆట ముగిసేసరికి 69 ఓవర్లలో 3/172.
వికెట్ల పతనం: మిచెల్ స్టార్క్ 42/2, జొష్ హాజల్‌వుడ్ 50/1.

చిత్రం..రెండో టెస్టు మ్యాచ్‌లో అర్ధ సెంచరీలు సాధించి నాటౌట్‌గా నిలిచిన భారత కెప్టెన్ కోహ్లీ,
వైస్ కెప్టెన్ అంజిక్యా రహానే