క్రీడాభూమి

ఫాస్టెస్ట్ 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు! తనకే సాధ్యమైన బ్యాటింగ్‌తో ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ సాధించి, తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 25 సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు! ఓవరాల్‌గా బ్రాడ్‌మన్ (52 మ్యాచ్‌లు, 68 ఇన్నింగ్స్‌లు) మొదటి స్థానంలో ఉండగా, కోహ్లీ (76 మ్యాచ్‌లు, 128 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు! సచిన్ తెండ్కూలర్ (130), సునీల్ గవాస్కర్ (138), మ్యాథ్యూ హెడేన్ (139) ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించి కోహ్లీ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం కోహ్లీ రికార్డును అధిగమించే అవకాశం ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కే (117 ఇన్నింగ్స్‌ల్లో 23 సెంచరీలు) ఉంది. దీంతో పాటు విరాట్ సరసన మరో రికార్డు చేరింది! ఆసీస్ గడ్డపై ఆరు సెంచరీలు నమోదు చేసిన సచిన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఆసీస్ గడ్డపై 2012 ఆడిలైడ్‌లో తొలి సెంచరీ సాధించిన కోహ్లీ.. 2014-15 సిరీస్‌లో నాలుగు సెంచరీలు, ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో ఒక సెంచరీ నమోదు చేశాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 11 సెంచరీలతో సచిన్ ముందు వరుసలో ఉండగా, 8 సెంచరీలతో గవాస్కర్, ఆరు సెంచరీలతో కోహ్లీ కొనసాగుతున్నాడు.