క్రీడాభూమి

పృథ్వీ షా దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాతో జరుగతున్న నాలుగు టెస్టు సిరీస్‌లలో భాగంగా ఇప్పటికే జరిగిన తొలి టెస్టుతోపాటు ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టుకు కూడా దూరమైన 19 ఏళ్ల ముంబై యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా మొత్తం సిరీస్‌కే దూరం కానున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ఇటీవల జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్యాచ్ పట్టే సమయంలో షా మోకాలి నొప్పి బారిన పడ్డాడు. అప్పటినుంచి విశ్రాంతి తీసుకుంటున్నా పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పృథ్వీ షా స్థానంలో 27 ఏళ్ల కర్నాటకకు చెందిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు టీమిండియాలో స్థానం కల్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. పృథ్వీ షా స్థానే మయాంక్ అగర్వాల్ పేరును ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ బీసీసీఐకి ప్రతిపాదించింది.