క్రీడాభూమి

తడబ్యాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్: ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో పైచేయి సాధించి రెండో టెస్టులోనూ ఆధిపత్యం చెలాయించాలని చేస్తున్న ప్రయత్నాలకు ఆసిస్ గండి కొట్టేలా ఉంది. ఆతిధ్య జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 108.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 93.2 ఓవర్లలో 243 పరుగులకు వికెట్లన్నింటినీ చేజార్చుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 105.5 ఓవర్లలో 283 పరుగులు చేసింది. సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసేసరికి 41 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఆదివారం మూడోరోజు ఆసిస్ రెండో ఇన్నింగ్స్ ఆట ముగిసేసరికి ప్రత్యర్థిపై 175 పరుగుల ఆధిక్యంతో ఉంది. నాలుగోరోజు 132/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన ఆసిస్ కోహ్లీ సేన ఎదుట 287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆతిధ్య జట్టులో కెప్టెన్-వికెట్ కీపర్ టిమ్ పైన్ 116 బంతులు ఎదుర్కొని 4 బౌండరీలతో 37 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. 31 బంతులు ఎదుర్కొన్న అరోన్ ఫించ్ 5 బౌండరీలతో 25 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 213 బంతులు ఎదుర్కొన్న ఉస్మాన్ ఖాజా 5 బౌండరీలతో 72 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్యాట్ కమిన్స్ 6 బంతులను ఎదుర్కొని 1 పరుగు చేసి జస్ప్రీత్ బుమ్రా చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాథన్ లియాన్ 10 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 5 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో హనుమ విహారి చేతికి దొరికిపోయాడు. 29 బంతులు ఎదుర్కొన్న మిచెల్ స్టార్క్ 3 బౌండరీలతో 14 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా చేతిలో బౌల్డ్ అయ్యాడు. భోజన విరామ సమయం వరకూ ఒక్క వికెట్‌ను కూడా చేజార్చుకోని ఆసిస్ ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది. కేవలం 51 పరుగులకే 6 వికెట్లను కోల్పోవడం విశేషం.
భారత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 24 ఓవర్లలో 56 పరుగులిచ్చి అత్యధికంగా 6 వికెట్లు తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 25.2 ఓవర్లలో 39 పరుగులిచ్చి 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 16 ఓవర్లలో 45 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన భారీ లక్ష్యం (287 పరుగులు) ఛేదనకు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన కోహ్లీ సేనకు శుభారంభం దక్కలేదు. 4 బంతులు ఎదుర్కొన్న ఓపెనర్ లోకేష్ రాహుల్ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుతిరిగాడు. చటేశ్వర్ పుజారా 11 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 4 పరుగులు చేసి జొష్ హాజల్‌వుడ్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు భాగస్వామ్యంతోపాటు ఎన్నో రికార్డులను సవరించిన, సమం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. 40 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 2 బౌండరీలతో 17 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాజాకు క్యాచ్ ఇచ్చాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ 67 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలతో 20 పరుగులు చేసి నాథన్ లియాన్ చేతిలో బౌల్డ్‌గా వెనుతిరిగాడు. వైస్‌కెప్టెన్ అజింక్య రహానే 47 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, 2 బౌండరీల సహాయంతో 30 పరుగులు చేసి జొష్ హాజల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసేసరికి హనుమ విహారి 24, వికెట్ కీపర్ రిషబ్ పంత్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆసిస్ బౌలర్లలో జొష్ హాజల్‌వుడ్ 11 ఓవర్లలో 24, నాథన్ లియాన్ 12 ఓవర్లలో 30 పరుగులిచ్చి తలో రెండేసి వికెట్లు తీసుకున్నారు. మిచెల్ స్టార్క్ 10 ఓవర్లలో 28 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ఇదిలావుండగా రెండో ఇన్నింగ్స్ ఆట ముగిసేసరికి టీమిండియా 41 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. కోహ్లీ సేన విజయానికి ఇంకా 175 పరుగుల దూరంలో ఉండగా చేతిలో మరో 5 వికెట్లు ఉన్నాయి. ఆల్‌రౌండర్ హనుమ విహారి, వికెట్ కీపర్ రిషబ్ పంత్ (బ్యాట్స్‌మెన్‌లు) మినహాయిస్తే బరిలోకి రానున్న మిగిలినవారంతా బౌలర్లే. దీంతో భారత్‌పై తీవ్ర వత్తిడి పెరిగింది. విజయానికి ఇంకా 175 పరుగుల లక్ష్యం..చేతిలో ఇంకా 5 వికెట్లు ఉండడంతో కోహ్లీ సేన కష్టాల్లో పడింది. పెర్త్‌లోని పచ్చని మైదానం మరోపక్క పేస్, బౌన్స్‌కు సహరించే పిచ్ కావడం, ఇంకోపక్క బంతులతో ప్రత్యర్థిని వణికించే సామర్థ్యం కలిగిన మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, నాథన్ లియాన్ వంటి బౌలర్లు ఉండడంతో పరుగుల కోసం ఎదురీదుతున్న కోహ్లీ సేనకు ఐదోరోజు మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగింపులో క్రీజులో ఉన్న హనుమ విహారి, రిషబ్ పంత్‌పై భారీ అంచనాలతో ఉంది.
*
ఇరు జట్ల సంక్షిప్త స్కోరు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 108.3 ఓవర్లలో 326 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 105.5 ఓవర్లలో 283 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 93.2 ఓవర్లలో 243 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: (ఆట ముగిసేసరికి) 41 ఓవర్లలో 112/5.