క్రీడాభూమి

స్పిన్నర్ ఆలోచనే రాలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 18: రెండో టెస్టు మ్యాచ్‌లో 146 భారీ పరుగుల వ్యత్యాసంతో ఓటమిని చవి చూసిన టీమిండియా ఇప్పుడు లోపం ఎక్కడుందో కనుక్కునే పనిలో పడింది. పెర్త్ టెస్టులో నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన భారత్‌కు స్పిన్నర్ ఆవశ్యకత తెలిసివచ్చింది. ప్రత్యర్థి జట్టు ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ టెస్టులో ఏకంగా 8 వికెట్లు పడగొట్టడం విశేషం. అయితే, టీమిండియా ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ షమీ సైతం ఈ టెస్టులో అత్యధికంగా 6 వికెట్లు తీసుకున్నా స్పిన్నర్ లేని లోటు స్పష్టమైంది. ఇదే విషయాన్ని కెప్టెన్ విరా ట్ కోహ్లీ అంగీకరించాడు. రెండో టెస్టులో నలుగురు పేసర్లను బరిలోకి దించి పోరాడామని, కానీ స్పిన్నర్ ఆవశ్యతను గుర్తించలేకపోయామని అంగీకరించాడు. పెర్త్ మైదానంలోని పిచ్‌ను చూసిన తర్వాత ఆఫ్‌స్పిన్నర్ రవీంద్ర జడేజా గురించి కనీసం ఆలోచనే రాలేదని, నలుగురు పేసర్లు ఉంటే సరిపోతుందనే అనుకున్నామని పేర్కొన్నాడు. అయితే, రెండో టెస్టులో కేవలం పేసర్లను నమ్ముకుని బరిలోకి దిగిన భారత్ కనీసం ఒక్క స్పిన్నర్‌ను అయినా జట్టులోకి తీసుకోకపోవడం వల్లే ఓటమిని చవిచూశామని వస్తున్న విమర్శకుల వాదనను కోహ్లీ తోసిపుచ్చాడు. తమ బౌలర్లు ఆద్యంతం ఆకట్టుకున్నారని, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుతంగా రాణించాడని ప్రశంసించాడు. అదేవిధంగా బ్యాట్స్‌మెన్‌లంతా కూడా పోరాడామని, కానీ ప్రత్యర్థి దూకుడును నిలువరించడంలో విఫలమయ్యామని అంగీకరించాడు. అయితే, ఈనెల 26 మెల్బోర్న్‌లో జరిగే ప్రతిష్టాత్మక మూడో టెస్టు కోసం తామంతా ఎదురుచూస్తున్నామని, ఇందులో పైచేయి సాధించేందుకు మానసికంగా సిద్ధమవుతున్నామని, ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొంటామనే గట్టి నమ్మకం తనకు ఉందని అన్నాడు. ఇదిలావుండగా, రెండో టెస్టు సందర్భంగా ఆతిధ్య జట్టు కెప్టెన్ టిమ్ పైన్ విషయంలో తాను హద్దులు మీరి వ్యవహరించలేదని, వ్యక్తిగత దాడులకు పాల్పడలేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఆసిస్ కెప్టెన్ వికెట్ల మధ్య పరుగులు తీస్తున్నపుడు తాను అతనిని అడ్డగించి వాగ్వావాదానికి దిగినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నాడు.