క్రీడాభూమి

ఐపీఎల్ వేలంలో కోటీశ్వరులు వరుణ్ చక్రవర్తి, జయదేవ్ ఉనద్కత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 18: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆటగాళ్ల ఎంపిక కోసం జరిగిన వేలంలో ఇద్దరు భారత క్రికెటర్లు మిలియనీర్లుగా ఘనత సాధించారు. అయితే, టీమిండియా ప్రపంచ కప్‌ల వీరుడు, సిక్సర్ల ధీరుడు యువరాజ్ సింగ్‌ను మొదటి రౌండ్‌లో కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపకపోడం విశేషం. అయతే రెండో రౌండ్‌లో ముంబై యువరాజ్‌ను కనీస ధర రూ.కోటికి సొంతం చేసుకుంది. జైపూర్‌లో మంగళవారం జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల ఎంపికలో వాస్తుశిల్పి నుంచి క్రికెటర్‌గా అవతారమెత్తిన వరుణ్ చక్రవర్తి అత్యధికంగా 8.4 కోట్ల రూపాయలకు అమ్ముడు కావడం గొప్ప విశేషం. వరుణ్ చక్రవర్తి కనీస ధర (20 లక్షలు) కంటే 40 రెట్లు ఎక్కువకు అమ్ముడుపోవడం సంచలనం సృష్టించింది. ఇతనిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం చేజిక్కించుకుంది. తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల వరుణ్ చక్రవర్తి చాలాకాలం పాటు వాస్తుశిల్పిగా ఉండి, ఆ తర్వాత కాలంలో క్రికెటర్‌గా అవతారమెత్తాడు. ఇతనిని జట్టులోకి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని ఆశిస్తున్నామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ మీనన్ తెలిపాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా రాణించిన వరుణ్ చక్రవర్తి మధురై పాంథర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించి టీఎన్‌పీఎల్ టైటిల్ దక్కించుకునేందుకు ఎంతో కృషి చేశాడని పేర్కొన్నాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శాం కురణ్‌ను 7.2 కోట్ల రూపాయలతో పంజాబ్ జట్టు తీసుకుంది. భారత మీడియం పేసర్ జయదేవ్ ఉనద్కత్ సైతం మరోసారి మిలియనీర్‌గా ఘనత దక్కించుకున్నాడు. ఇతనిని రాజస్థాన్ రాయల్స్ 8.4 కోట్ల రూపాయలకు జట్టులోకి తీసుకుంది. ఈ ఏడాది ఇదే యాజమాన్యం ఉనద్కత్‌ను 11.5 కోట్ల రూపాయలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. వేలంలో కీలక ఆటగాళ్లను చేజిక్కించుకునేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ ఏడాది రెండు కోట్ల రూపాయలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో చోటుదక్కించుకున్న భారత సీనియర్ క్రికెటర్, 37 ఏళ్ల యువరాజ్ సింగ్ ఆశించిన రీతిలో ఆటతీరును కనబరచలేకపోయాడు. దీంతో రెండో రౌండ్ వేలంలో ముంబై ముందుకొచ్చింది. గతంలో 16 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన యువరాజ్ సింగ్‌ను ఈసారి రూ.కోటికే దక్కించుకుంది. వెస్టిండీస్ ఆటగాళ్లలో షిమ్రాన్ హెట్‌మెయిర్, కార్లోస్ బ్రాత్‌వైట్, నికొలస్ పూరన్‌తోపాటు పలువురు భారత క్రికెటర్లు అత్యధికంగా అమ్ముడుపోయినవారి జాబితాలో ఉన్నారు. హెట్‌మెయిర్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4.2 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది. హెట్‌మెయిర్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య గట్టి పోటీ ఎదురైనా ఆర్సీబీ చేజిక్కించుకుంది. హెట్‌మెయిర్ సహచర ఆటగాడు, 2016 వరల్డ్ టీ-20 స్టార్ కార్లోస్ బ్రాత్‌వైట్‌ను 5 కోట్ల రూపాయలకు కోల్‌కతా నైట్‌రైడర్స్ వశం చేసుకుంది. మరో విదేశీ ఆటగాడు, వికెట్ కీపర్, 23 ఏళ్ల యువకుడు కనీస ధర 75 లక్షలు కాగా, ఇతనిని 4.20 కోట్ల రూపాయలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేజిక్కించుకుంది. భారత స్పిన్నర్ అక్షర పటేల్‌ను ఢిల్లీ కేపిటల్స్ 5 కోట్ల రూపాయలతో తీసుకుంది. టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారిని 2 కోట్ల రూపాయలతో ఢిల్లీ కేపిటల్స్ తీసుకుంది. భారత పేసర్ ఇషాంత్ శర్మను సైతం 1.1 కోట్ల రూపాయలతో ఢిల్లీ కేపిటల్స్ జట్టులోకి తీసుకుంది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను 1.2 కోట్ల రూపాయలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ వశం చేసుకుంది. మహమ్మద్ షమీ గత సీజన్‌లో ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహించగా ఇపుడు పంజాబ్ జట్టు అతనిని రూ.4.8 కోట్లకు కొనుగోలు చేసింది. పేసర్ మొహిత్ శర్మను రూ.5కోట్లతో మళ్లీ చెన్నై సూపర్‌కింగ్స్‌లో చోటుదక్కించుకున్నాడు. వేలంలో ఇంకా అమ్ముడుపోని ఆటగాళ్లలో చటేశ్వర్ పుజారా, బ్రెండన్ మెక్‌కల్లమ్, క్రిస్ వోక్స్ ఉన్నారు.