క్రీడాభూమి

140 ఆలౌట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్: ఆస్ట్రేలియాతో పెర్త్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. అడెలైడ్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 31 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించిన కోహ్లీ సేన పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో పరుగుల ఛేదనలో ఘోరంగా విఫలమైంది. 50 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆతిధ్య ఆసిస్ 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయింది. అంతకుముందు ఆతిధ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 108.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 105.5 ఓవర్లలో 283 పరుగులు చేసింది. ఆసిస్ రెండో ఇన్నింగ్స్‌లో 98.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో 140 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగుల లక్ష్య ఛేదనకు భారత్ బరిలోకి దిగింది. 41 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఐదోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా ఆట ముగిసేసరికి కేవలం 28 పరుగులే అదనంగా చేసింది. క్రీజులో ఉన్న హనుమ విహారి 75 బంతులు ఎదుర్కొని 4 బౌండరీలతో 28 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మార్కస్ హ్యారిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 61 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 30 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 23 బంతులు ఎదుర్కొన్న ఉమేష్ యాదవ్ కేవలం 2 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. ఇషాంత్ శర్మ 5 బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా ప్రారంభించకుండానే ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. జస్ప్రీత్ బుమ్రా 3 బంతులు ఎదుర్కొని ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. మహమ్మద్ షమీ నాటౌట్‌గా నిలిచాడు. ఆసిస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 17 ఓవర్లలో 46 పరుగులు, నాథన్ లియాన్ 19 ఓవర్లలో 39 పరుగులిచ్చి తలో 3 వికెట్లు తీసుకున్నారు. జొష్ హాజల్‌వుడ్ 11 ఓవర్లలో 24 పరుగులు, ప్యాట్ కమిన్స్ 9 ఓవర్లలో 25 పరుగులిచ్చి తలో 2 వికెట్లు పడగొట్టారు.
ఇరు జట్ల సంక్షిప్త స్కోరు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 108.3 ఓవర్లలో 326 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 105.5 ఓవర్లలో 283 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 98.2 ఓవర్లలో 243 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 56 ఓవర్లలో 140 ఆలౌట్