క్రీడాభూమి

పాండ్య, రాహుల్ సరే.. హర్మన్‌ప్రీత్ సింగ్‌పై చర్యలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజాబ్, జనవరి 14: ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌పై బీసీసీఐ కఠినంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. చివరికి క్ష మాపణలు చెప్పినా ఆస్ట్రేలియా పర్యటను దూరంగా ఉం చింది. బీసీసీఐ వ్యవహరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమాను లు బీసీసీఐ తీసుకున్న క్రమశిక్షణ చర్యలను కొనియా డారు. అయతే ఇక్కడివరకు బాగానే ఉన్న అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ మరో ప్రశ్న సందిస్తున్నారు. తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించి ఉద్యో గంలో చేరిన టీమిండియా మహిళా జట్టు టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్న ల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్ వేదికగా 2016లో జరిగిన మహిళల వనే్డ ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడిన హర్మన్‌ప్రీత్. ఆస్ట్రేలియాపై 171 పరుగులు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో పంజాబ్ ప్రభుత్వం హర్మన్‌ప్రీత్‌కు డీఎస్పీగా ఉద్యోగ అవకాశం కల్పించింది. 2018లో ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు డిగ్రీ సర్టి ఫికెట్లు సమర్పించిన హర్మన్ స్వయంగా పంజాబ్ ము ఖ్యమంత్రి చేతులమీదుగా బాధ్యతలు కూడా చేపట్టింది. కానీ కొద్దిరోజులకే విచారణలో అవి తప్పుడు ధ్రువ పత్రాలుగా తేలడంతో ఆమెను డీఎస్పీ హోదా నుంచి త ప్పించారు. అయతే దీనిపై బీసీసీఐ ఎందుకు వౌనం వ హించాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని అభిమా నులు, క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై హర్మన్‌ప్రీత్ కూ డా తగిన వివరణ ఇ వ్వకపోవడం గమనార్హం.