క్రీడాభూమి

కంగారు పుట్టించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడిలైడ్, జనవరి 14: సిడ్నీ వేదికగా జరిగిన మొదటి వనే్డలో అతిథ్య జట్టుపై ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమిండియా మంగళవారం జరిగే రెండో వనే్డలో గెలిచి ప్రతికారం తీర్చుకోవాలని భావిస్తోంది. టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాకు ఏమాత్రం అవకాశమివ్వని భారత్ అనుహ్యాంగా మొదటి వనే్డ ఓడింది. బౌలింగ్ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను నిలువరించినా, బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ విఫలమవడంతో భారత్ గెలుపు కోసం చివరి దాకా పోరాడింది. టీమిండియాలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ ధనాధన్ మహీంద్ర సింగ్ ధోని మినహా మరెవ్వరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. మరోవైపు శిఖర్ ధావన్, అంబటి రాయుడు పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరడం, రన్ మిషన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం మూడు పరుగులు చేసి అవుటయ్యాడు. ఒక దశలో నాలుగు పరుగులకే మూడు కీలక వికెట్లను భారత్ కోల్పోయంది. మరోవైపు అతిథ్య జట్టు సినీయర్లకు విశ్రాంతినిచ్చి, యువ ఆటగాళ్లకు స్థానం కల్పించడం వారికి కలిసొచ్చింది. జె రిచర్డ్‌సన్ అయతే మొదటి వనే్డలో భారత పతనాన్ని శాసించాడు. 10 ఓవర్లు వేసి 2 మెయడిన్లతో 26 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లను కూల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక మంగళవారం అడిలైడ్‌లో జరిగే రెండో వనే్డలోనూ వికెట్లు సాధిస్తామని ధీమాగా ఉన్నాడు. ఇదిలా ఉంటే మొదటి వనే్డ విజయంతో ఆస్ట్రేలియా ఉత్సాహంగా బరిలోకి దిగుతుండగా, అదే జట్టుతో రెండో వనే్డ ఆడే అవకాశముంది.
ఓపెనర్లు కుదురుకుంటేనే..
నేడు జరిగే వనే్డలో ఓపెనర్లు రాణిస్తేనే విజయం తేలికవుతుంది. అతిథ్య జట్టుకు ముందుగానే వికెట్లు సమర్పించుకుంటే వారిలో మనోస్థైర్యాన్ని నింపినట్లవుతుంది. ఓపెనర్లు కనీసం వందకు పై చిలుకు భాగస్వామ్యం నమోదు చేసే దిశగా ఆడాలి. అలాగే నాలుగో స్థానంలోనూ అంబటి రాయుడు బదులు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహీంద్ర సింగ్ ధోనిని పంపితే జట్టుకు ప్రయోజనకరంగా ఉండే అవకాశముంది. మొదటి వనే్డలో ధోని మొదట క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా, క్రీజులో కుదురుకున్నాక తనదైన శైలిలో బ్యాట్ ఝళిపించాడు. చివరగా 2017 డిసెంబర్‌లో శ్రీలంకతో జరిగిన వనే్డలో అర్ధ సెంచరీ సాధించిన ధోని మొదటి వనే్డలో మరో అర్ధ సెంచరీ చేయడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇదే ఫాం కొనసాగితే మునుపటి ధోనిని చూడొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గిల్, విజయ్ శంకర్‌కు చోటు డౌటే..
సస్పెన్షన్‌కు గురైన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ స్థానంలో ఆస్ట్రేలియా పర్యటను వచ్చిన శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్‌లకు రెండో వనే్డలో చోటు కల్పిస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్ 2018లో జరిగిన ముక్కోణపు వనే్డ సిరీస్ (నిదహాస్)లో దారుణంగా విఫలమై, అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జట్టులో కనిపించని విజయ్ శంకర్ ను ఆడిస్తారా లేదా అనేది అనుమానమే. మరో ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు చోటు కల్పించాలంటే అంబటి రాయుడుని పెవిలియన్‌లో కూర్చోబెట్టాల్సి రావడంతో వీరిద్దరికి రెండో వనే్డ చోటు అనుమానమే.