క్రీడాభూమి

ఫెదరర్, నాదల్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు రాఫెల్ నాదల్, డిఫెండింగ్ చాంపియన్, మూడో ర్యాంకర్ రోజర్ ఫెదరర్ తమతమ ప్రత్యర్థులను ఓడించి శుభారంభం చేశారు. గతంలో ఫిట్నెస్ సమస్యతో అల్లాడిన నాదల్, కాలికి శస్త్ర చికిత్స తర్వాత కోలుకొని మళ్లీ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన ప్రత్యర్థులకు సవాళ్లు తప్పవని మొదటి రౌండ్‌లో జేమ్స్ డక్‌వర్త్‌ను 6-4, 6-3, 7-5 తేడాతో ఓడించడం ద్వారా సందేశం పంపాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన డక్‌వర్త్ గొప్పగా పోరాడినప్పటికీ, నాదల్ అపారమైన అనుభవం ముందు అతను తల వంచక తప్పలేదు. కాగా, ఫెదరర్ 6-3, 6-4, 6-4 ఆధిక్యంతో డెనిస్ ఇస్టోమిన్‌పై సులభంగా గెలుపొంది రెండో రౌండ్ చేరాడు. ఇతర మ్యాచ్‌ల్లో, అలెక్స్ డి మినౌర్ 6-4, 7-5, 6-4 స్కోరుతో పెడ్రో సౌసాను ఓడించగా, ఐదో ర్యాంక్ ఆటగాడు కెవిన్ ఆండర్సన్ 6-3, 5-7, 6-2, 6-1 ఆధిక్యంతో ఆండ్రియన్ మనారినోపై విజయాన్ని నమోదు చేశాడు. సీనియర్ ఆటగాడు థామస్ బెర్డిచ్ 6-3, 6-0, 7-5 స్కోరుతో 13వ ర్యాంకర్ కేల్ ఎడ్మండ్‌ను ఇంటిదారి పట్టించాడు.

చిత్రాలు.. రోజర్ ఫెదరర్ రాఫెల్ నాదల్