క్రీడాభూమి

ఫామ్‌లోకి సెరెనా విలియమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 17: కెరీర్‌లో ఇప్పటి వరకూ 23 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించింది. ఏడు పర్యాయాలు ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఆమె 2017లో చివరిసారి ఈ టైటిల్ సాధించింది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఆమె యూగెనీ బుచార్డ్‌ను 6-2, 6-2 తేడాతో చిత్తుచేసి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చానన్న సంకేతాలు పంపింది. ఖాతాలో ఇంత వరకూ ఏడు ఆస్ట్రేలియా ఓపెన్‌తోపాటు ఏడు వింబుల్డన్, మూడు ఫ్రెంచ్ ఓపెన్, ఆరు యూఎస్ ఓపెన్ టైటిళ్లను కూడా కైవసం చేసుకున్న సెరెనా కెరీర్‌లో 24వ గ్రాండ్ శ్లామ్‌ను సాధించాలన్న పట్టుదలతో ఉంది. కాగా, టాప్ సీడ్ క్రీడాకారిణి సిమోనా హాలెప్ 6-3, 6-7, 6-4 తేడాతో సోఫీ కెనిన్‌పై విజయం సాధించింది. నాలుగో ర్యాంకర్ నవోమీ ఒసాకా 6-2, 6-4 ఆధిక్యంతో తమరా జిడాన్‌సెక్‌ను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. వీనస్ విలియమ్స్ 6-3, 4-6, 6-0 తేడాతో ఎలిజ్ కార్నెట్‌పై విజయం సాధించి, ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. ఆరోసీడ్ ఎలినా స్విటోలినా 6-4, 6-1 స్కోరుతో విక్టోరియా కుజ్మోవాపై గెలుపొందింది. ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా 4-6, 6-1, 6-0 తేడాతో మాడిసన్ బ్రెంగిల్‌ను ఓడించగా, 17వ సీడ్ మాడిసన్ కీస్ 6-3, 6-4 తేడాతో అనస్తాసియా పొటపొవాపై గెలుపొంది, మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. మహిళల విభాగంలో ఈ ఏటి విజేత ఎవరనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పోటీ తీవ్రంగా ఉండడమే అందుకు కారణం.