క్రీడాభూమి

పొరపాట్లు అందరూ చేస్తారు: గంగూలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జనవరి 17: తప్పులు జరగడం సహజమని, పొరపాట్లు అందరూ చేస్తారని, అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ని గంగూలీ వెనుకేసు కొచ్చాడు. గురువారం హిందీ మూవీ 22 యార్డ్స్ ట్రైలర్ లాంచ్‌లో పాలొ గన్న దాదా ఈ అంశంపై స్పందించా డు. నేను ఆ టీవీ షో చూడలేదు. కానీ ఈ కాలం క్రికెటర్లు బాధ్యతా యుతంగా వ్యవహరించాలంటూ అందరినీ కలిపి ప్రకటన చేయడం సరికాదు. మనం మనుషులం. మెషీ న్లం కాదు. వాళ్లు రోల్‌మోడల్స్ కావ చ్చు. కానీ బాగా ఆడాలనే ఒత్తిడి వారి పై ఉంటుంది. ఇలాంటివి పట్టించు కోకుండా ముందుకెళ్లాలని సూచించా డు. పాత తరం క్రికెటర్లతో పోలిస్తే ఇ ప్పటి క్రికెటర్లు బాధ్యతాయుతంగా లేదన్న విమర్శను సౌరవ్ కొట్టిపా డేశాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు భారత్ నుంచి రావడం అదృష్టమని పేర్కొన్నాడు.