క్రీడాభూమి

సిరీస్‌పై టీమిండియా కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై 72 తర్వాత టెస్ట్ సిరీస్ గెలిచి రికార్డు సృష్టించిన టీమిండియా, వనే్డ సిరీస్‌పైనా కనే్నసింది. మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవగా, చివరిదైనా వనే్డ నేడు మెల్‌బోర్న్‌లో జరగనుంది. సిరీస్ కోసం రెండు జట్లు పోటీ పడుతుండగా, ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో భారత్ జట్టే పైచేయగా ఉంది. సిడ్నీ వేదికగా జరిగిన మొదటి వనే్డలో ఆసీస్ 34 పరుగులతో విజయం సాధించగా, అడిలైడ్‌లో జరిగిన రెండో వనే్డలో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఇప్పటివరకు 1985లో వరల్డ్ ఛాంపియన్ షిప్, 2008లో సీబీ సీరిస్ గెలవగా, 2016లో 4-1తో ఓటమి చవిచూసింది. 2018-19లో ఇప్పటివరకు ఇక్కడ ఒక్క సిరీస్ ఓడని టీమిండియా, 2-1తో టెస్ట్ సిరీస్‌ని గెలుచుకుంది. అయతే ఐదో బౌలర్ విషయంలో కొంత సందిగ్దత నెలకొంది. ఆస్ట్రేలియా టూర్ ముందు వరకు ఆ స్థానాన్ని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయగా, కొన్ని కారణాలతో పాండ్యా వనే్డ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. దీంతో రెండో వనే్డలో ఐదో బౌలర్‌గా ప్రయోగించిన కలీల్ అహ్మద్ (0-55), మహ్మద్ సిరాజ్ (0-76) దారుణంగా విఫలమవ్వగా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ రాణిస్తుండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. అయతే ఐదో బౌలర్‌గా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడుని ప్రయోగించినా పెద్దగా కలిసిరాలేదు. మరోవైపు రాయుడు బౌలింగ్ యాక్షన్ పై మ్యాచ్ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఇదిలాఉంటే సస్పెన్షన్‌కు గురైన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, మరో లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహాల్‌ను చివరి వనే్డలో ఐదో బౌలర్‌గా తీసుకునే అవకాశముంది. వీరిద్దరూ గురువారం మెల్‌బోర్న్ మైదానంలో సాధన కూడా చేయడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. విజయ్ శంకర్‌ను తుది జట్టులోకి తీసుకుంటే మూడో ఫాస్ట్ బౌలర్‌తో పాటు బ్యాటింగ్ లైనప్ కూడా బలపడేందుకు అవకాశాలున్నాయ. మరోవైపు టీం మేనేజ్‌మెంట్, కెప్టెన్ కోహ్లీ మాత్రం ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతోనే తుది జట్టును ప్రకటించేలా ఆలోచనలు చేస్తున్నారు. ఒకవేళ విజయ్ శంకర్, కేదర్ జాదవ్‌ను జట్టులోకి తీసుకుంటే అంబటి రాయుడు, దినేష్ కార్తీక్‌ను పక్కనబెట్టే అవకాశముంది. దినేష్ కార్తీక్ రెండో వనే్డలో అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. బౌలింగ్ విషయం అటుంచితే బ్యాటింగ్ కూర్పులో నాలుగో స్థానం భారత్‌కు కొంత ఇబ్బందిగా మారింది.
ఆ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న అంబటి రాయుడు రెండు వనే్డల్లో పెద్దగా రాణించలేదు. ఇక జార్ఖండ్ డైనమెట్ మహీంద్ర సింగ్ ధోనీ చాలారోజుల తర్వాత జట్టులోకి వచ్చినా రెండు వనే్డల్లో అర్ధ సెంచరీలు చేసి తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఒకదశలో రెండో వనే్డ ఓటమి నుంచి భారత్ గట్టెక్కిందంటే ధోనీ బ్యాటింగే కారణం. ఇదిలాఉంటే ఆస్ట్రేలియా జట్టును బ్యాటింగ్ సమస్య ఇబ్బంది పెడుతోంది. రెండు వనే్డల్లోనూ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ స మాత్రమే రాణించారు. మెల్‌బోర్న్‌లో భారత్‌తో 14 మ్యాచ్‌లాడిన కంగారులు తొమ్మిదింటా గెలిచారు.
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహాల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, విజయ్ శంకర్,
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పీటర్ హ్యాండ్స్‌కాంబ్, ఉస్మాన్ ఖాజా, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జే రిచర్డ్‌సన్, పీటర్ సిడెల్, బిల్లీ స్టాన్‌లేక్, మార్కస్ స్టొయనిస్, ఆడం జంపా.

చిత్రం..మెల్‌బోర్న్ మైదానంలో సాధన చేస్తున్న భారత ఆటగాళ్లు