క్రీడాభూమి

ఫెదరర్‌తో కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 19: టీమిండియా క్రికెట్ చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ సాధించని ఘనతను అందుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం దిగ్గజ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌ను కలుసుకున్నాడు. మెల్‌బోర్న్‌లో గత ఆరు రోజులుగా ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై టీ-20, టెస్టు సిరీస్, వనే్డ సిరీస్‌లలో క్లీన్ స్వీప్ చేయడంలో కోహ్లీ తనదైన ముద్రను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా మైదానంలో ఆడిన ఒక్క సిరీస్‌లోనైనా ఓటమి ఎరుగకుండా సగర్వంగా నిలిచిన దేశంగా భారత్ పేరు ప్రఖ్యాతులను ప్రపంచానికి చాటిచెప్పాడు. మెల్‌బోర్న్‌లోని రోడ్ లావెర్ అరెనా మైదానంలో జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా ఫెదరర్‌ను టీమిండియా కెప్టెన్ కోహ్లీ తన సహచరి అనుష్క శర్మతో కలసి భేటీ అయ్యాడు. టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ నవొక్ జొకోవిచ్ పురుషుల సింగిల్స్‌లో డెనిస్ షపొవలొవ్‌ను మూడో రౌండ్‌లో ఓడించడంతోపాటు మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ మూడో రౌండ్‌లో గెలుపుతో నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించిన పోటీని తన భార్య అనుష్క శర్మతో కలసి కోహ్లీ వీక్షించాడు. అనంతరం రోజర్ ఫెదరర్‌తో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.