క్రీడాభూమి

భారత్‌కు బ్లాక్ క్యాప్ చాలెంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపియర్, జనవరి 22: ఆస్ట్రేలియా టూర్‌లో సాధించిన ఘన విజయంతో మంచి ఊపుమీద ఉన్న టీమిండియా కివీస్ గడ్డపై కూడా అదే ఆటతీరును ప్రదర్శించడం ద్వారా రానున్న వరల్డ్ కప్ కంటే ముందు మరింత బలమైన జట్టుగా ఎదగాలని టీమిండియా తపన పడుతోంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇపుడు బుధవారం నుంచి కివీస్ మైదానంలో ఐదు వనే్డల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఆసిస్‌తో జరిగిన టీ-20 సిరీస్, టెస్టు సిరీస్, వనే్డ సిరీస్‌లను చేజిక్కించుకున్న కోహ్లీ సేన న్యూజిలాండ్ టూర్‌లో 5 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 3 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆసిస్‌తో పోల్చుకుంటే బలమైన కివీస్‌లోని ఉద్ధండులైన బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లను ఢీకొనడంతోపాటు ఇక్కడి పిచ్ వాతావరణం కూడా భిన్నంగా ఉండడంతో భారత్ తీవ్రంగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. న్యూజిలాండ్ టీమ్‌లో అపార అనుభవం కలిగిన ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గుసన్, టిమ్ సౌథీ వంటి వారు జట్టును ప్రగతిపథంలో నడిపే శక్తియుక్తులు కలిగివున్నారు. కివీస్‌తో ఇంతవరకు టీమిండియా 35 వనే్డ మ్యాచ్‌లు ఆడగా, కేవలం 10 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. 2014లో జరిగిన టెస్టు సిరీస్‌ను ఆతిధ్య జట్టు 4-0తో కైవసం చేసుకుంది. భారత్‌లోని ముంబయిలో గతంలో న్యూజిలాండ్‌తో తలపడ్డామని, ఆ మ్యాచ్‌లో ఆ జట్టును ఓడించామని, ఆ జట్టులోని ప్రతిఒక్కరిలోనూ పోటీతత్వం కనిపించిందని, ఇది నిజంగా ఆహ్వానించదగ్గదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి వనే్డకు ముందు మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో అన్నాడు. భారత జట్టులో శిఖర్ ధావన్ ఫామ్‌లో లేకపోవడం బాగా వేధించే సమస్య. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీని ఏ స్థానంలో బరిలోకి దింపితే సమతూకం పాటించినట్టు అవుతుందని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. అదేవిధంగా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఒక టీవీ షోలో మహిళలను ఉద్దేశించిన అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యపై సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో అతను ఇపుడు జట్టులోకి రావడం అనుమానమే. పాండ్య రాకుంటే ఈ స్థానాన్ని రిషబ్ పంత్ ద్వారా భర్తీ చేయనున్నారు. ధావన్‌ను ఓపెనర్‌గా తప్పిస్తే శుభ్‌మాన్ గిల్‌కు చాన్స్ రావొచ్చు. అదేవిధంగా కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్, విజయ్‌శంకర్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. పాండ్యాను తీసుకోని పరిస్థితుల్లో జట్టులోకి మూడో పేసర్ అవసరాన్ని కూడా బలంగా గుర్తించడంతో ఐదు వనే్డలకు ఖలీల్ అహమ్మద్, మహమ్మద్ సిరాజ్‌లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని కెప్టెన్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కాగా, భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఏవిధంగా ఆడితే ఉత్తమంగా రాణించగలమో అన్న అంశంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించనున్నామని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అన్నాడు.