క్రీడాభూమి

ఎదురులేని నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో దిగ్గజ ఆటగాడు, ప్రపంచ రెండో ర్యాంకర్, స్పానిష్‌కు చెందిన టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఎదురులేకుండా పోయింది. తొలి రౌండ్ నుండి క్వార్టర్ ఫైనల్స్ వరకు నాదల్ అప్రతిహతంగా దూసుకుపోతున్నాడు. సెమీఫైనల్స్‌లో బెర్త్ కోసం మంగళవారం జరిగిన పోరులో అమెరికాకు చెందిన ఫ్రానె్సస్ టియాఫోను 6-3, 6-4, 6-2 తేడాతో ఓడించాడు. పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో జరిగిన మరో పోరులో ప్రపంచ 14వ ర్యాంకర్, గ్రీకు దేశానికి చెందిన యువ సంచలనం స్ట్ఫెనోస్ సిట్‌సిపాస్ తన ప్రత్యర్థి, స్పానిష్‌కు చెందిన 22వ ర్యాంకర్ రాబెర్టో బౌటిస్టా అగస్ట్‌ను 7-5, 4-6, 6-4, 7-6 (7-2)తో ఓడించి సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. ఇక మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో అమెరికాకు చెందిన డేనియల్లీ కొలిన్స్ తన సమీప ప్రత్యర్థి రష్యాకు చెందిన అనస్టాసియా పాల్యుచెంకోవాను 2-6, 7-5, 6-1 తేడాతో ఓడించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌లో జరిగిన మరో పోటీలో ప్రపంచ నెంబర్ 8వ ర్యాంకర్, క్రెచ్ స్టార్ పెట్రా క్విటోవా ఆస్ట్రేలియా క్రీడాకారిణి, 15వ ర్యాంకర్ ఆష్‌లీగ్ బార్టీని 6-1, 6-4 తేడాతో ఓడించి సెమీస్‌లో బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
చిత్రాలు.. రాఫెల్ నాదల్* పెట్రా క్విటోవా * సిట్‌సిపాస్ * కొలిన్స్